ఇంట్రడ్యూస్ చేస్తున్నాం Gemini, మీ కొత్త పర్సనల్ AI అసిస్టెంట్
Google Assistant, గత 8 ఏళ్లుగా లక్షలాది మందికి సహాయం చేసింది. ప్రయాణంలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఫోన్లలో పనులు పూర్తి చేయడానికి దోహదం చేసింది. ఆ సమయంలో Assistant నుండి ఇంకా చాలా ఆశిస్తున్నాం అన్న రిక్వెస్ట్‌లు కూడా మీ నుండి మాకు వచ్చాయి – ఆ రిక్వెస్ట్‌ల్లో ఒకటి మీకు తగ్గట్లుగా దీన్ని పర్సనలైజ్ చేయడం, మీరు సహజంగా మాట్లాడగలిగే సదుపాయం రావడం, తద్వారా ఇంకా మరెన్నో పనులు చేయడానికి సహాయం పొందడం. అందుకే ఒక అసిస్టెంట్ మీ ఫోన్‌లో విప్లవాత్మకంగా ఏమి చేయగలదా అని ఆలోచించాము, దాన్ని Googleకు చెందిన అత్యంత శక్తిమంతమైన AI మోడల్స్‌తో రీ-బిల్డ్ చేశాము.
Gemini, ఒక కొత్త రకమైన AI అసిస్టెంట్. పూర్తిగా కొత్త ఆలోచనలో దీన్ని బిల్డ్ చేశాం. భాషను అర్థం చేసుకోవడంలో, రీజనింగ్‌లో ఇది అత్యాధునికంగా ఉంది. Gemini పట్ల మేము చాలా ఎగ్జయిటింగ్‌గా ఉన్నాము. మీకు ఎంతగానో నచ్చే Google Assistantలోని హ్యాండ్స్-ఫ్రీ ఎక్స్‌పీరియన్స్‌ను అందించడమే కాకుండా Gemini మరెన్నో చేయగలదు. ఇది మాటలను అర్థం చేసుకోవడంతో పాటు సంక్లిష్టమైన టాస్క్‌లను హ్యాండిల్ చేయడంలో మీకు సహాయం చేస్తుంది. సైడ్-బై-సైడ్ పరీక్షల్లో, సహజమైన భాషను అర్థం చేసుకోవడంలో మెరుగ్గా ఉందని, అందువల్ల Gemini సక్సెస్ రేటు ఎక్కువగా ఉందని యూజర్లు చెప్పడం మేము గమనించాము.
Geminiని, Google Assistantను కంపేర్ చేసి, మీరు ఏ విధంగా సరికొత్త మార్గాల్లో సహాయం పొందగలరో చూద్దాం. Geminiని అత్యంత సహాయకరమైన పర్సనల్ AI అసిస్టెంట్‌గా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మీరు ఇచ్చే ఫీడ్‌బ్యాక్ ఆధారంగా దీనిని వేగంగా మెరుగుపరచడంపై మేము పూర్తి స్థాయిలో దృష్టి సారించాము. ఈ ఇంప్రూవ్‌మెంట్స్‌తో ఈ పేజీని అప్‌డేట్ చేస్తాము. మరింత సమాచారం కోసం మీరు ఏ సమయంలోనైనా Geminiకి చెందిన రిలీజ్ అప్‌డేట్లను చూడవచ్చు. ఏ కారణం చేతనైనా మీరు Geminiని వద్దనుకుంటే, సెట్టింగ్స్‌కు వెళ్లి Google Assistantకు మారవచ్చు. మరింత తెలుసుకోండి.
Geminiని, Google Assistantతో పోల్చి చూస్తే
Gemini నిజంగా అద్భుతాలు చేయగలదు. AIతో మాట్లాడటం, దాని ద్వారా పనులు చేయించుకోవడం అనే అంశాలకు సంబంధించి ఒక ఫండమెంటల్ షిఫ్ట్‌ను (ప్రాథమిక మార్పును) సూచిస్తుంది. మీరు Geminiని ఉపయోగించడాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు:
-
సహజంగా మాట్లాడే భాషను Gemini అర్థం చేసుకోగలదు. అందువల్ల మీరు మీ PAతో మాట్లాడినట్లు, దానితో మాట్లాడవచ్చు, లేదా ఏదైనా రాసి చెప్పవచ్చు.
-
Gemini భారీ డేటా మీద, అత్యాధునికమైన AI మోడల్స్ మీద ఆధారపడి బిల్డ్ అయింది. అంటే ఇది కొన్ని సింపుల్ రిక్వెస్ట్‌లకు సంబంధించి Google Assistant కన్నా ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఈ అంశం మీద మేము చురుగ్గా పని చేస్తున్నాం. Gemini మరింత వేగంగా పని చేసే ప్రయత్నాల్లో ఉన్నాము.
-
Google Assistantతో పోలిస్తే Gemini, ఎక్కువ ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలదు. అయితే ప్రతిసారి సరైన సమాధానాలు ఇవ్వలేకపోవచ్చు. డబుల్-చెక్ ఫీచర్ ద్వారా Gemini ఇచ్చిన సమాధానాలను మీరు చెక్ చేసుకోవచ్చు. Gemini తాను ఇచ్చే సమాధానాల్లో పేర్కొన్న సోర్సులను రివ్యూ చేయవచ్చు. లేదా అత్యంత ముఖ్యమైన అంశాలపై సమాచారం కోసం Google Searchను ఉపయోగించవచ్చు.
Google Assistantలో పాపులర్‌గా ఉన్న ఫీచర్లలో ఏవేవి ఇప్పుడు Geminiలో అందుబాటులో ఉన్నాయి, లేదా త్వరలో అందుబాటులోకి రానున్నాయి అన్న అంశానికి సంబంధించిన లిస్ట్ ఇదిగోండి. దయచేసి గమనించండి: ఈ లిస్ట్ కేవలం మీ ఫోన్‌కు లేదా ఎలిజిబిలిటీ ఉన్న ఇతర Android పరికరాలకు మాత్రమే వర్తిస్తుంది.
ఈవెంట్లు, రిమైండర్లు & లిస్ట్‌లు
(Calendar, Keep & Tasks)
వీడియో గురించి అడగండి (YouTube)
(YouTube Music)
మీ ఫోన్ లాక్‌లో ఉన్నప్పుడు: సమాధానాలు పొందండి, అలారాలు & టైమర్లు సెట్ చేయండి, మీడియా ప్లేబ్యాక్‌ను కంట్రోల్ చేయండి, పరికర సెట్టింగ్‌లు & రొటీన్ విషయాలను కంట్రోల్ చేయండి
మీ ఫోన్ లాక్‌లో ఉన్నప్పుడు: అదనపు ఫీచర్స్ (ఉదా., ఈమెయిల్, కాల్స్, మెసేజెస్, రిమైండర్స్, స్మార్ట్ హోమ్ కంట్రోల్)
మీ ఫోన్‌ను కంట్రోల్ చేయండి (ఉదా., యాప్‌లు తెరవడం, వెబ్‌సైట్‌లు, కెమెరా, సెట్టింగ్‌లు)
ఫీచర్ | Gemini లభ్యత |
---|---|
ఈవెంట్లు, రిమైండర్లు & లిస్ట్‌లు (Calendar, Keep & Tasks) |
|
వీడియో గురించి అడగండి (YouTube) |
|
(YouTube Music) |
|
మీ ఫోన్ లాక్‌లో ఉన్నప్పుడు: సమాధానాలు పొందండి, అలారాలు & టైమర్లు సెట్ చేయండి, మీడియా ప్లేబ్యాక్‌ను కంట్రోల్ చేయండి, పరికర సెట్టింగ్‌లు & రొటీన్ విషయాలను కంట్రోల్ చేయండి |
|
మీ ఫోన్ లాక్‌లో ఉన్నప్పుడు: అదనపు ఫీచర్స్ (ఉదా., ఈమెయిల్, కాల్స్, మెసేజెస్, రిమైండర్స్, స్మార్ట్ హోమ్ కంట్రోల్) |
|
ఇతర మెసేజింగ్ యాప్‌లు
|
|
PDF గురించి అడగండి
(Gemini Advancedతో Androidలో మాత్రమే అందుబాటులో ఉంది)
|
|
మీ ఫోన్‌ను కంట్రోల్ చేయండి (ఉదా., యాప్‌లు తెరవడం, వెబ్‌సైట్‌లు, కెమెరా, సెట్టింగ్‌లు) |
|
Geminiని కలిసి మెరుగుపరుద్దాం
మీ ఫీడ్‌బ్యాక్ ద్వారా మేము నిరంతరం నేర్చుకుంటూ Geminiని మరింత వేగవంతంగా సమర్థవంతంగా చేయడానికి కృషి చేస్తున్నాము, ప్రతిసారీ మేము సరైన మార్గాన్ని అనుసరించకపోవచ్చు. Gemini కోసం ఆసక్తికరమైన సరికొత్త సామర్థ్యాలను రూపొందించడానికి పని చేస్తూనే, ప్రత్యేకంగా Google Assistant మీద ఆధారపడి ఉన్నవారికోసం రోజువారీ ఎక్స్‌పీరియెన్స్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము.
ఏదైనా జెమిని సమాధానానికి బాగుంది (థమ్స్ అప్) లేదా బాగాలేదు (థమ్స్ డౌన్) అని సూచించడం, మీ ఆలోచనలను పంచుకోవడం ద్వారా మీ ఫీడ్‌బ్యాక్‌ను ఇవ్వండి. మేము మీ నుండి వాటిని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాము.
నిర్దిష్ట భాషల్లో, దేశాల్లో ఎంపిక చేసిన పరికరాలు, అనుకూల ఖాతాల్లో (కంపాటిబుల్ అకౌంట్స్‌లో) ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి; అనుకూల (కంపాటిబుల్) కంటెంట్‌తో ఫీచర్స్ పని చేస్తాయి. ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న Android పరికరం కావాలి. దాన్ని సెట్-అప్ చేసి ఉండాలి. ఖచ్చితత్వం కోసం సమాధానాలను పరిశీలించండి..