Skip to main content

ఒకేసారి పలు రకాల యాప్‌ల్లో టాస్క్‌లు పూర్తి చేయడానికి సాయం పొందండి

ఇప్పుడు మీరు Gmail నుండి సమ్మరీలను పొందవచ్చు. Google Keepలో మీ కిరాణా సామాన్ల లిస్ట్‌కు సులభంగా ఐటెమ్‌లను జోడించవచ్చు. మీ ఫ్రెండ్ చెప్పిన ట్రావెల్ ఐడియాలను Google Mapsలో చిటికెలో మార్క్ చేయవచ్చు. YouTube Musicలో మీకు కావాల్సిన విధంగా ప్లేలిస్ట్‌ను క్యురేట్ చేసుకోవచ్చు. ఇంకా మరెన్నో చేయవచ్చు.

మీ ఈమెయిల్స్‌లో సరైన సమాచారాన్ని కనుగొనండి

కొన్ని కాంటాక్ట్‌ల నుండి వచ్చిన ఈమెయిళ్లకు సమ్మరీ ఇవ్వు లేదా మీ ఇన్‌బాక్స్‌లో నిర్దిష్ట సమాచారాన్ని వెతికి పెట్టు అని Geminiని అడగండి.

కొత్త మ్యూజిక్‌ను వినండి

మీకు నచ్చిన పాటలను, ఆర్టిస్ట్‌ల మ్యూజిక్‌ను, ప్లేలిస్ట్‌లను ప్లే చేయండి, సెర్చ్ చేయండి, కనుగొనండి. ఏ సందర్భానికైనా సరే తగిన విధంగా ఉండే ప్లేలిస్ట్‌ను Gemini క్రియేట్ చేస్తుంది – ఉదాహరణకు, 2020 నుండి ఇప్పటి దాకా టాప్ సాంగ్స్ క్యూరేటెడ్ ప్లేలిస్ట్.

మీ రోజును మెరుగ్గా ప్లాన్ చేసుకోండి

Gemini మీ క్యాలెండర్‌ను ఆర్గనైజ్ చేస్తుంది, మీ ఈవెంట్‌లను ట్రాక్ చేయడంలో సాయం చేస్తుంది. ఒక మ్యూజిక్ కన్సర్ట్ ఫ్లయర్‌ను (పాంప్లెట్‌ను) ఫోటో తీయండి. దానిలో ఉన్న వివరాల ఆధారంగా క్యాలెండర్ ఈవెంట్‌ను క్రియేట్ చేయి అని Geminiకి చెప్పండి.

ప్రముఖ టెక్స్ట్‌బుక్స్ నుండి విశ్వసనీయమైన నాలెడ్జ్‌ను పొందండి

రైస్ యూనివర్సిటీకి చెందిన OpenStaxతో Geminiకి కొలాబరేషన్ ఉంది. దీని వల్ల Gemini, అకడమిక్ టెక్స్ట్‌బుక్స్ నుండి సమాచారాన్ని సేకరించగలదు. OpenStax ఒక నాన్‌-ప్రాఫిట్ ఎడ్యుకేషనల్ ఇనిషియేటివ్ (విద్యా రంగానికి సంబంధించిన లాభాపేక్ష లేని సంస్థ). ఏదైనా ఒక కాన్సెప్ట్ / టాపిక్ గురించి, సంబంధిత టెక్స్ట్‌బుక్స్ కంటెంట్‌కు లింక్‌లను ప్రొవైడ్ చేస్తూ క్లుప్తంగా వివరాలు ఇవ్వు అని Geminiని అడగండి.