Skip to main content

Gemini Canvas

యాప్‌లు, గేమ్‌లు, ఇన్‌ఫోగ్రాఫిక్‌లు ఇంకా మరిన్నింటి రూపంలో మీ ఐడియాలకు జీవం పోయండి. మా అత్యంత సమర్థవంతమైన మోడల్ అయిన Gemini 2.5 Proతో, కేవలం నిమిషాల్లో ప్రాంప్ట్ నుండి ప్రోటోటైప్‌ను క్రియేట్ చేయండి.

Canvas అంటే ఏంటి

విజువలైజ్ చేయండి, ఇంకా పర్సనలైజ్ చేసుకోండి

మీ Deep Research రిపోర్ట్‌లను యాప్‌లుగా, గేమ్‌లుగా, ఇంటరాక్టివ్ క్విజ్‌లుగా, వెబ్ పేజీలుగా, ఇన్ఫోగ్రాఫిక్‌లుగా మార్చండి, ఇది కొత్త విషయాలను తెలుసుకోవడానికి, ఎక్స్‌ప్లోర్ చేయడానికి, ఇంకా గణాంకాలను షేర్ చేయడానికి మీకు పూర్తిగా ఒక కొత్త మార్గాన్ని అందిస్తుంది.

ప్రాంప్ట్‌ను అందించండి, క్రియేట్ చేయండి

మీ ఐడియాను వివరించండి చాలు, Canvas దాని కోసం కోడ్‌ను జెనరేట్ చేస్తుంది, ఈ కోడ్ మీ ఐడియాను ఉపయోగించడమే కాకుండా షేర్ చేయగల యాప్ లేదా గేమ్‌గా మారుస్తుంది.

డ్రాఫ్ట్‌ను క్రియేట్ చేసి, డాన్ని మెరుగుపరచండి

ఆకట్టుకునే డ్రాఫ్ట్‌లను జెనరేట్ చేయడం, దాని టోన్‌ను మెరుగుపరచడం, కీలక విభాగాలను చక్కగా ట్యూన్ చేయడం, ఇన్‌స్టంట్, ఉపయోగకరమైన ఫీడ్‌బ్యాక్‌ను పొందడం ద్వారా మీ రైటింగ్‌ను మెరుగుపరచండి.

స్టడీ గైడ్‌లను, సోర్స్‌లను అప్‌లోడ్ చేయండి, ఆపై లెర్నింగ్ ప్రాసెస్‌ను మరింత ఎంగేజింగ్‌గా మార్చడానికి Gemini అనుకూల క్విజ్‌ను క్రియేట్ చేస్తుంది. మీ అవగాహనను అంచనా వేయడానికి దీన్ని ఉపయోగించండి, లేదా ఫన్ ఛాలెంజ్ కోసం ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీతో లింక్‌ను షేర్ చేయండి.

యానిమేషన్‌ల సహాయంతో అల్గారిథమ్‌లు ఎలా పని చేస్తాయో చూడటం ద్వారా సంక్లిష్టమైన కాన్సెప్ట్‌లను బాగా అర్థం చేసుకోండి, ఇది కాంప్లెక్స్ ఐడియాలను సులభంగా అర్థం చేసుకోవడానికి, ఇంకా కోడ్ వాస్తవానికి ఎలా పని చేస్తుందో మీకు ఒక ఐడియా ఇవ్వడానికి సహాయపడుతుంది.

Gemini సహాయంతో మీ డాక్యుమెంట్‌లను, రీసెర్చ్‌ను లేదా స్పీచ్‌లను మెరుగుపరచుకోండి. క్విక్ ఎడిటింగ్ టూల్స్, కీలకమైన విభాగాలను విస్తరించడంలో, టోన్‌ను సర్దుబాటు చేయడంలో, అలాగే మీ డ్రాఫ్ట్‌పై గణాంకాలతో కూడిన ఫీడ్‌బ్యాక్‌ను పొందడంలో మీకు సహాయపడతాయి.

Gemini సహాయంతో విశ్లేషించడం నుండి స్ట్రాటజీ ప్రిపేర్ చేయడం వరకు ప్రాసెస్‌ను వేగవంతం చేయండి, ఇది మీకు ఐడియాలను చర్చించడంలో, సిఫార్సుల విషయంలో, ఇంకా సమయాన్ని ఆదా చేస్తూ, మెరుగైన ఫలితాలను ఇవ్వడానికి హై క్వాలిటీ డెలివర్‌లను క్విక్‌గా మెరుగుపరచడంలో సహాయం చేస్తుంది.

ప్రతి ఒక్కరినీ తాజా సమాచారంతో అప్‌డేటెడ్‌గా ఉంచడానికి, వర్క్‌ఫ్లోలను స్ట్రీమ్‌లైన్ చేయడంలో సహాయపడటానికి, టీమ్ ట్రాకర్‌ల నుండి కస్టమర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లు, సేల్స్ పైప్‌లైన్‌ల వరకు మీ టీమ్ కోసం అనుకూలంగా రూపొందించిన డ్యాష్‌బోర్డ్‌లను క్రియేట్ చేయండి.

ఇంటరాక్టివ్ ధర స్లయిడర్‌తో రియల్ టైమ్‌లో త్వరిత, అవసరానికి తగ్గట్టుగా ధర అంచనాలను పొందండి. సంభాషణలను వేగంగా ముందుకు తీసుకెళ్లే, అలాగే కన్వర్షన్‌లను పెంచే ఇన్‌స్టంట్, వ్యక్తిగతీకరించిన ప్రపోజల్స్‌ను అందించడంలో మీ టీమ్‌కు సపోర్ట్ చేయండి.

మీ స్వంత కల్పిత 3D ప్రపంచాలను జెనరేట్ చేయండి. ప్రత్యేకమైన వివరాలతో విభిన్న గ్రహాలను ఇన్‌స్టంట్‌గా రెండర్ చేయడానికి స్పేస్‌బార్‌ను నొక్కండి.

ఫన్ ఛాలెంజ్ కోసం మీ ఆడియో మెమరీని టెస్ట్ చేసుకోండి. కార్డ్‌లను క్లిక్ చేయండి, సౌండ్స్ వినండి, ఆపై మ్యాచ్ అయ్యే పెయిర్‌లను కనుగొనండి.

సౌండ్‌తో ప్రయోగాలు చేయడానికి, మీ స్వంత మెలోడీలను క్రియేట్ చేయడానికి డిజిటల్ సింథసైజర్‌లో మ్యూజిక్‌ను కంపోజ్ చేయండి.

అల్గారిథమ్‌లు ఎలా పని చేస్తాయో చూడండి, ఉదాహరణకు ఈ బ్రెత్-ఫస్ట్ సెర్చ్ అల్గారిథమ్. ప్రారంభ పాయింట్ నుండి ముగింపు పాయింట్‌కు అల్గారిథమ్ పాత్‌ను ఫాలో అవ్వడానికి ఈ గ్రిడ్‌ను ఉపయోగించండి, అడ్డంకులు ఉన్నప్పటికీ అది అతి చిన్న పాత్‌ను ఎలా కనుగొంటుందో, ఇంకా సందర్శించిన ప్రతి సెల్ ఎలా హైలైట్ చేయబడుతుందో గమనించండి.

తరచుగా అడిగే ప్రశ్నలు

దీన్ని యాక్సెస్ చేయడం సులభం. ప్రాంప్ట్ బార్ కింద, “Canvas”ను ఎంచుకొని, డాక్యుమెంట్‌ను లేదా కోడింగ్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించడానికి మీ ప్రాంప్ట్‌ను ఎంటర్ చేయండి.

Canvas, Gemini యూజర్‌లందరికీ అందుబాటులో ఉంది. Google AI Pro, Google AI Ultra సబ్‌స్క్రయిబర్‌లు మా అత్యంత సమర్థవంతమైన మోడల్, Gemini 2.5 Pro, అలాగే మరింత క్లిష్టమైన ప్రాజెక్ట్‌ల కోసం గణనీయంగా పెద్దదైన 10 లక్షల టోకెన్ కాంటెక్స్ట్ విండోతో Canvasను యాక్సెస్ చేయవచ్చు.

ప్రాంప్ట్ బార్ కింద ఉన్న Deep Researchను ఎంచుకోండి. మీ Deep Research రిపోర్ట్ కొత్త Canvasలో జెనరేట్ అవుతుంది. రీసెర్చ్ పూర్తయిన తర్వాత, మీకు Canvas పైన కుడి వైపున “క్రియేట్ చేయండి” బటన్ కనిపిస్తుంది. "క్రియేట్ చేయండి" అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి, డ్రాప్-డౌన్ మెనూలో వెబ్ పేజీ, ఇన్ఫోగ్రాఫిక్, క్విజ్ లేదా ఆడియో ఓవర్‌వ్యూను క్రియేట్ చేయడానికి ఆప్షన్‌లు ఉంటాయి. ఈ ఆప్షన్‌లలో ఒకదాన్ని ఎంచుకోండి, Canvas దానికి ఎలా ప్రాణం పోస్తుందో చూడండి.

అవును, మీరు ఇప్పటికీ మీ మొబైల్ యాప్‌లో మీ Canvas ప్రాజెక్ట్‌లను యాక్సెస్ చేయవచ్చు. డెస్క్‌టాప్‌లోని Gemini వెబ్ యాప్‌లో మీరు టెక్స్ట్ స్టయిల్‌ను, ఫార్మాట్‌ను మాత్రమే ఎడిట్ చేయగలరని దయచేసి గమనించండి. ఈ ఫంక్షనాలిటీ మొబైల్ డివైజ్‌లలో అందుబాటులో లేదు.

Gemini యాప్ అందుబాటులో ఉన్న అన్ని భాషల్లో, దేశాల్లో Gemini యూజర్‌లకు Canvas అందుబాటులో ఉంది.