ప్రాంప్ట్‌తో మీ ఫోటోలను కొత్తగా ఊహించండి
మీ ఫోటోలను మరింత మెరుగుపరచండి. విభిన్నమైన సీన్స్‌లో మిమ్మల్ని మీరు ఊహించుకోండి, క్రియేటివ్ ఎలిమెంట్‌లను కలపండి, నిర్దిష్ట ఎడిట్‌లను చేయండి, ఇంకా మరిన్ని చేయండి. మీ ఊహకు అవన్నీ సాధ్యమే.
మీ ఫోటోలు, మీ విజన్
ఎక్కడైనా మీ ఫోటోను చూడండి
విభిన్న ప్రదేశాలకు వెళ్లినట్టుగా, దుస్తులు ధరించినట్టుగా, హెయిర్‌స్టయిల్స్ ఉన్నట్టుగా, లేదా వివిధ దశాబ్దాలకు చెందిన ఫ్యాషన్‌కు తగ్గట్టుగా మీ ఫోటోను మీరు మార్చుకోండి.
మీ ఫోటోలను కలపండి
మీరు ఎలిమెంట్‌లను కలపడానికి, వాటిని ఒకే సీన్‌లో కలపడానికి పలు ఫోటోలను అప్‌లోడ్ చేయవచ్చు.
మీ ఫోటోలను రీమిక్స్ చేయండి
ఒక ఆబ్జెక్ట్ స్టయిల్, రంగు, లేదా టెక్స్‌చర్‌ను బదిలీ చేసి, మరొక ఆబ్జెక్ట్‌కు వర్తింపజేయండి.
నిర్దిష్ట ఎడిట్‌లు చేయండి
కేవలం పదాలతో మీ ఫోటోలలో నిర్దిష్ట ఎలిమెంట్‌లను సులభంగా ఎడిట్ చేయండి. ఫోటోను రీస్టోర్ చేయండి, బ్యాక్‌గ్రౌండ్‌ను మార్చండి, సబ్జెక్ట్‌ను రీప్లేస్ చేయండి, ఇంకా మరిన్ని చేయండి.
ఇమేజ్‌లను సెకన్లలో క్రియేట్ చేయండి
అత్యధిక క్వాలిటీ గల టెక్స్ట్-టు-ఇమేజ్ మోడల్ అయిన Imagen 4 సహాయంతో Geminiలో అద్భుతమైన ఇమేజ్‌లను క్రియేట్ చేయండి. మీ ఐడియాలను సునాయాసంగా స్పష్టమైన వివరాలతో, నిజమైనవిగా అనిపించే విజువల్స్‌గా మార్చుకోండి.
టైపోగ్రాఫ్‌ల గురించి మాట్లాడుకుంటే…
Imagen 4 నెక్స్ట్ లెవల్ ఖచ్చితత్వంతో టెక్స్ట్‌కు రెండర్ చేసి దృశ్య రూపం ఇస్తుంది.
సరికొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టండి,
లిటరల్‌గా.
మీ మ్యాక్రోస్‌ను పొందండి
మీరు కలగనే ఏ స్టయిల్ అయినా సాధ్యమే
సర్రియాలిటీని అన్వేషించండి
తరచుగా అడిగే ప్రశ్నలు
Gemini యాప్ అందుబాటులో ఉన్న అన్ని భాషల్లో, దేశాల్లో AI ఇమేజ్ జెనరేషన్ అందుబాటులో ఉంది.
సింపుల్ ఫార్ములాతో ప్రారంభించండి. <Create/generate an image of> <subject> <action> <scene>ను ట్రై చేసి, ఆపై దాని నుండి బిల్డ్ చేయండి. ఉదాహరణకు, "కిటికీ అంచున సూర్యరశ్మిలో కునుకు తీస్తున్న పిల్లి ఇమేజ్‌ను క్రియేట్ చేయి."
మీరు ఎంత ఎక్కువ వివరాలను అందించగలరో, అంత నిర్దిష్టంగా ఉండండి. ప్రాంప్ట్‌లలో మీరు ఆలోచించగల అన్ని నిర్దిష్ట అంశాలను చేర్చాలి, కాబట్టి, "ఎరుపు రంగు డ్రెస్ వేసుకున్న మహిళ ఇమేజ్‌ను క్రియేట్ చేయి" అని చెప్పడానికి బదులుగా, "ఎరుపు రంగు డ్రెస్ వేసుకున్న యువతి పార్క్ గుండా పరిగెడుతున్న ఇమేజ్‌ను క్రియేట్ చేయి" అని ట్రై చేయండి. మీరు ఎంత ఎక్కువ వివరాలను అందిస్తే, మీ సూచనలను ఫాలో అవ్వడంలో Gemini అంత మెరుగ్గా ఉంటుంది.
కంపోజిషన్, స్టయిల్, ఇమేజ్ క్వాలిటీని పరిగణనలోకి తీసుకోండి. మీ ఇమేజ్‌లోని ఎలిమెంట్‌లను ఎలా అమర్చాలనుకుంటున్నారు (కంపోజిషన్), మీరు సాధించాలనుకుంటున్న విజువల్ స్టయిల్ (స్టయిల్), కావలసిన ఇమేజ్ క్వాలిటీ స్థాయి (ఇమేజ్ క్వాలిటీ), అలాగే ఆకార నిష్పత్తి (సైజ్) గురించి ఆలోచించండి. “2:3 ఆకార నిష్పత్తితో ఆయిల్ పెయింటింగ్ స్టయిల్‌లో అంతరిక్షంలో ఎగురుతున్న బ్లర్ అయిన ముళ్ల పంది ఇమేజ్‌ను జెనరేట్ చేయి” వంటి వాటిని ట్రై చేయండి.
క్రియేటివిటీ మీకు సహాయం చేస్తుంది. Gemini, అద్భుతమైన ఆబ్జెక్ట్‌లను, ప్రత్యేకమైన సీన్స్‌ను క్రియేట్ చేయడంలో చాలా గొప్పది. మీ ఊహలకు రెక్కలు తొడగండి.
మీకు నచ్చనిది ఏదైనా ఉంటే, దానిని మార్చమని Geminiని అడగండి. మా ఇమేజ్ ఎడిటింగ్ మోడల్‌తో మీరు మీ ఇమేజ్‌లపై కంట్రోల్ సాధించవచ్చు. బ్యాక్‌గ్రౌండ్‌ను మార్చమని, ఆబ్జెక్ట్‌ను రీప్లేస్ చేయమని, లేదా ఎలిమెంట్‌ను జోడించమని Geminiని అడగవచ్చు – మీకు కావాల్సిన డిటైల్స్ ఏవీ పోకుండా, ఫోటో మీద మీదైన ముద్ర వేయవచ్చు.
మా AI గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా, ఈ AI ఇమేజ్ జెనరేటర్ బాధ్యతాయుతంగా రూపొందించబడింది. Geminiతో క్రియేట్ చేసిన విజువల్స్‌కు, ఒరిజినల్ హ్యూమన్ ఆర్ట్‌వర్క్‌కు మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉందని నిర్ధారించడానికి, Gemini కనిపించని SynthID వాటర్‌మార్క్‌ను, అలాగే అవి AI ద్వారా జెనరేట్ చేయబడ్డాయని చూపడానికి కనిపించే వాటర్‌మార్క్‌ను ఉపయోగిస్తుంది.
Gemini అవుట్‌పుట్‌లు ప్రధానంగా యూజర్ ప్రాంప్ట్‌ల ద్వారా నిర్ణయించబడతాయి, జెనరేటివ్ AI టూల్ ఏదైనా ఎలా పని చేస్తుందో, అలాగే దీనిలో సైతం, కొంతమంది వ్యక్తులు అభ్యంతరకరంగా భావించే కంటెంట్‌ను జెనరేట్ చేసే సందర్భాలు ఉండవచ్చు. మేము థంబ్స్ అప్/డౌన్ బటన్ల ద్వారా మీ ఫీడ్‌బ్యాక్‌ను వింటూనే ఉంటాము, నిరంతర మెరుగుదలలు చేస్తాము. మరిన్ని వివరాల కోసం, మీరు మా వెబ్‌సైట్‌లో మా విధానం గురించి చదువుకోవచ్చు.