Gemini నుండి వ్యక్తిగతీకరించిన (పర్సనలైజ్ చేసిన) సహాయం పొందండి
మిమ్మల్ని అర్థం చేసుకునే AI నుండి సహాయం పొందండి.
మీ కోసం ప్రత్యేకంగా వ్యక్తిగతీకరించిన (పర్సనలైజ్ చేసిన) సహాయం
Gemini వ్యక్తిగతీకరించిన (పర్సనలైజ్ చేసిన) AI అసిస్టెంట్‌ను అందిస్తుంది. అది కేవలం సాధారణ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడమే కాకుండా, మిమ్మల్ని అర్థం చేసుకుని, మీ నిర్దిష్ట ఆసక్తులకు, అభిరుచులకు, కుతూహలానికి అనుగుణంగా సమాధానాలను అందిస్తుంది. ఎలాగో ఇక్కడ తెలుసుకోండి:
మీ Search హిస్టరీ ఆధారంగా మరింత సహాయం పొందండి
మీ తర్వాతి ప్రాజెక్ట్‌కు విజయవంతమైన ఐడియా పొందండి
మీ తర్వాతి ప్రాజెక్ట్‌ను ప్రారంభించడంలో సహాయపడే, మీ ప్రత్యేకమైన గోల్స్‌కు, అభిరుచులకు మ్యాచ్ అయ్యే కస్టమైజ్ చేసిన ఐడియా పొందండి.
వ్యక్తిగతీకరించిన (పర్సనలైజ్ చేసిన) సిఫార్సులు పొందండి
మీ ప్రత్యేక అభిరుచులకు అనుగుణంగా ఎంపిక చేసిన సిఫార్సులను చూడండి, అవి మీ సమయాన్ని ఆదా చేస్తాయి, మీరు నిజంగా ఇష్టపడే విషయాలను మీకు పరిచయం చేస్తాయి.
మీ కుతూహలాన్ని కొత్త కోణం నుండి చూడండి
మీ డిజిటల్ జర్నీ ఆధారంగా ప్రత్యేకమైన, వ్యక్తిగతీకరించిన (పర్సనలైజ్ చేసిన) అభిప్రాయాలను పొందండి.
మీ గోప్యత కంట్రోల్ మీ చేతుల్లోనే ఉంటుంది
మీకు పారదర్శకత, కంట్రోల్ విషయంలో హామీ ఇస్తున్నాము.
ఏం షేర్ చేయాలో మీరే ఎంచుకోండి
Gemini పర్సనలైజేషన్ ఫీచర్‌లు ఆప్షనల్. మీ Search హిస్టరీని కనెక్ట్ చేయాలా వద్దా, వ్యక్తిగత ప్రాధాన్యతలను షేర్ చేయాలా వద్దా, లేదా చాట్ హిస్టరీని ఎనేబుల్ చేయాలా వద్దా అనేది మీరే నిర్ణయించుకోండి.
మీ డేటాను సులభంగా మేనేజ్ చేయండి
మీ సేవ్ చేసిన సమాచారాన్ని, గత చాట్‌లను చూడటానికి, మేనేజ్ చేయడానికి మీ Gemini సెట్టింగ్‌లను యాక్సెస్ చేయండి. వెబ్ & యాప్ యాక్టివిటీకి వెళ్లడం ద్వారా కూడా మీ Search హిస్టరీని చూడవచ్చు, మేనేజ్ చేయవచ్చు.
మీరు నమ్మదగిన పారదర్శకత
Gemini, సమాధానాలను ఎలా వ్యక్తిగతీకరిస్తుందో, ఏ డేటా సోర్స్‌లను (మీకు సంబంధించి సేవ్ అయిన సమాచారం, పాత చాట్‌లు, లేదా Search హిస్టరీ) ఉపయోగించిందో తెలియజేసే పూర్తి అవుట్‌లైన్‌ను మా అధునాతన థింకింగ్ మోడల్ అందిస్తుంది.
సులభమైన, వ్యక్తిగతీకరించిన (పర్సనలైజ్ చేసిన) సహాయం
సరైన సమాచారాన్ని, సరైన సమయంలో, సరైన మార్గంలో పొందండి. AI పర్సనలైజేషన్‌తో కూడిన Gemini ఉపయోగకరమైన సూచనలను అందించడం ద్వారా మీ పనులను సులభతరం చేస్తుంది.
తరచుగా అడిగే ప్రశ్నలు
మా ప్రయోగాత్మక Gemini 2.0 Flash Thinking మోడల్ ఆధారిత పర్సనలైజేషన్ అనేది ఒక ప్రయోగాత్మక సామర్థ్యం, ఇది సందర్భోచిత, వ్యక్తిగతీకరించిన (పర్సనలైజ్ చేసిన) సమాధానాలను అందించడానికి, మీ Search హిస్టరీని ఉపయోగించుకోవడానికి Geminiకి వీలు కల్పిస్తుంది.
మీరు అందుకునే సమాచారం మీ ఆసక్తులకు, అవసరాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడం కోసం ఇది మీ ప్రాంప్ట్‌ను విశ్లేషించి, సమాధానాన్ని రూపొందించడంలో మీ గత Search హిస్టరీ సహాయకరంగా ఉంటుందో లేదో నిర్ణయిస్తుంది.
ఈ సామర్థ్యం Gemini 2.0 Flash Thinking మోడల్‌లో ప్రయోగంగా అందుబాటులో ఉంటుంది.
పర్సనలైజేషన్‌తో కూడిన Gemini ఒక ప్రయోగాత్మక ఫీచర్‌గా లాంచ్ అవుతోంది, నేడు వెబ్‌లో Gemini, Gemini Advanced సబ్‌స్క్రయిబర్‌లకు అందుబాటులో ఉంది, క్రమంగా మొబైల్‌లో కూడా అందుబాటులోకి వస్తుంది. ఈ ఎక్స్‌పీరియన్స్ ప్రస్తుతం 18 ఏళ్ల లోపు వారికి, Google Workspace లేదా Education యూజర్‌లకు అందుబాటులో లేదు. భవిష్యత్తులో వినియోగ పరిమితులు వర్తించవచ్చు.
ఇది ఐరోపా ఆర్థిక మండలి, స్విట్జర్లాండ్, యునైటెడ్ కింగ్‌డమ్ మినహా ప్రపంచవ్యాప్తంగా 45కి పైగా భాషలలో, చాలా దేశాల్లో అందుబాటులో ఉంది.