Veo 3తో సైలెన్స్‌ను బ్రేక్ చేయండి
మా లేటెస్ట్ AI వీడియో జనరేటర్ Veo 3 ద్వారా 8-సెకన్ల హై-క్వాలిటీ వీడియోలను క్రియేట్ చేయండి. Google AI Pro ప్లాన్‌లో భాగంగా దీన్ని ట్రై చేయండి. లేదా Ultra ప్లాన్ తీసుకుని గరిష్ఠ స్థాయి యాక్సెస్ పొందండి. మీ మనసులో ఏముందో చెప్పండి, సహజసిద్ధమైన ఆడియో ద్వారా మీ ఐడియాలు ఎలా జీవం పోసుకుంటాయో చూడండి.
Veo 3 గొప్పదనాన్ని దాని పనితీరే చెబుతుంది
ఊహించండి. ఎక్సప్లయిన్ చేయండి. దట్స్ ఇట్.
అన్వేషించడం కోసం
రకరకాల స్టయిల్స్ వాడండి, మీరు అసాధ్యం అని భావించే ఆబ్జెక్ట్‌లను ఒక చోటుకు తీసుకురండి, యానిమేటెడ్ పాత్రలకు ప్రాణం పోయండి. మీ ఊహాశక్తికి ఎంత పవర్ ఉందో చూడండి.
షేరింగ్ కోసం
ఫన్నీ మీమ్స్‌ను క్రియేట్ చేయండి, ఫ్రెండ్స్ మధ్యలో సరదాగా చెప్పుకునే జోక్స్‌ను వీడియోలుగా మార్చండి, మధుర జ్ఞాపకాలకు కొత్త సొబగులు అద్దండి, ఎదుటి వారి మోములో చిరునవ్వు విరిసేలా వాటికి పర్సనల్ టచ్ ఇవ్వండి.
ఐడియాలను చర్చించడం కోసం
ఐడియాలు తట్టక బుర్ర హీటెక్కుతున్నప్పుడు, మిమ్మల్ని కూల్ చేస్తూ క్షణాల్లో మీ ఆలోచనలకు ఒక రూపం ఇస్తుంది. ప్రోడక్ట్ కాన్సెప్ట్‌లు, డిజైన్ల దగ్గర నుండి ర్యాపిడ్ ప్రోటో-టైపింగ్, స్టోరీ టెల్లింగ్ దాకా ఎన్నో అంశాల్లో Gemini మీకు సాయం చేయగలదు.
మా Veo మోడల్స్ గురించి మరింత తెలుసుకోండి
Veo 3 Fast సహాయంతో Gemini సింపుల్ టెక్స్ట్‌ను, ఇమేజ్‌లను అనుకూల ఆడియోతో డైనమిక్ వీడియోలుగా మార్చగలదు.
మా అడ్వాన్స్‌డ్ వీడియో జెనరేషన్ మోడల్‌ను ఉపయోగించండి, సౌండ్‌తో కూడిన 8-సెకన్ల హై-క్వాలిటీ వీడియోలను క్రియేట్ చేయండి.
తరచుగా అడిగే ప్రశ్నలు
అవును, మీరు మీ మొబైల్ Gemini యాప్‌లో వీడియోలను క్రియేట్ చేసి, షేర్ చేయవచ్చు. వీడియోలను క్రియేట్ చేయడానికి, మీ ప్రాంప్ట్ బార్‌లోని "వీడియో" బటన్‌ను నొక్కండి. మీకు అది కనిపించకపోతే, మరిన్ని ఆప్షన్‌లను చూడటానికి, మూడు చుక్కలు ఉన్న బటన్‌ను ట్యాప్ చేయండి.
Google AI Pro ప్లాన్ ద్వారా Veo 3 Fastను ట్రై చేయండి. లేదా 70కి పైగా దేశాల్లో అందుబాటులో ఉన్న Google AI Ultraలో Veo 3ని గరిష్ఠ స్థాయిలో యాక్సెస్ చేయండి.
Veo 3 మోడల్స్ అందుబాటులో లేని దేశాలలో Veo 2 అందుబాటులో ఉంది.
AI వీడియో జెనరేషన్‌ను ఒక సురక్షితమైన ఎక్స్‌పీరియన్స్‌గా మార్చడానికి మేము పలు రకాల కీలకమైన భద్రతా చర్యలు తీసుకున్నాము. ఇందులో విస్తృతమైన రెడ్ టీమింగ్ ఉంది. ఇంకా మా పాలసీలను ఉల్లంఘించేలా కంటెంట్ జెనరేట్ కాకుండా ఉండేందుకు ఎవాల్యుయేషన్ విధానం ఉంది. అదనంగా, Gemini యాప్‌లో Veo ద్వారా జెనరేట్ అయిన అన్ని వీడియోల్లో కంటికి కనిపించే వాటర్‌మార్క్ ఉంటుంది. అలాగే SynthID ద్వారా ప్రతి ఫ్రేమ్‌లో ఎంబెడ్ చేసిన డిజిటల్ వాటర్‌మార్క్ ఉంటుంది. దీనివల్ల వీడియోలు AI ద్వారా జెనరేట్ అయ్యాయని తెలుస్తుంది.
Gemini అవుట్‌పుట్‌లు ఎలా ఉంటాయనేది ప్రధానంగా యూజర్ ఇచ్చే ప్రాంప్ట్‌ల మీద ఆధారపడి ఉంటుంది. ఇతర జెనరేటివ్ AI టూల్స్ మాదిరిగానే ఇందులో కూడా, కొన్ని సార్లు కొంత మందికి అభ్యంతరకరంగా అనిపించే కంటెంట్ జెనరేట్ అయ్యే అవకాశం ఉంది. థంబ్స్ అప్/డౌన్ బటన్ల ద్వారా మేము నిరంతరం మీ ఫీడ్‌బ్యాక్‌ను తెలుసుకుంటూనే ఉంటాము. మా సిస్టమ్‌ను మెరుగుపరుస్తూనే ఉంటాము. మరిన్ని వివరాల కోసం: మా వెబ్‌సైట్‌కు వెళ్లి మా విధానం గురించి చదవవచ్చు.
అన్వేషిస్తూనే ఉండండి
ఈ ఫలితాలు కేవలం ఉదాహరణ కోసమేనని గమనించగలరు. మరోసారి ప్రయత్నిస్తే ఇవి ఇలాగే రాకపోవచ్చు. కొన్ని నిర్దిష్టమైన ఫీచర్ల కోసం ఇంటర్నెట్, సబ్‌స్క్రిప్షన్ ఉండాలి. 18 ఏళ్లకు పైబడిన యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. బాధ్యతాయుతంగా క్రియేట్ చేయండి.