Skip to main content

Nano Banana
మీ కలలను రియాలిటీలోకి డూడుల్ చేయండి.

ఇప్పుడు Nano Bananaలో మీరు మీ ఎడిట్‌లను డూడుల్ చేయవచ్చు. ఇది పూర్తిగా కొత్త స్థాయి కంట్రోల్. మీ ఇమేజ్‌ను క్లిక్ చేయండి, డ్రా చేయండి, మీరు నిర్దిష్టంగా ఉండాలనుకుంటే టెక్స్ట్‌ను జోడించండి. మిగిలిన పనిని Gemini చేస్తుంది.

Dial in every detail
with Nano Banana Pro.

మీ ఇమేజ్ వైబ్‌ను పూర్తిగా మార్చండి. సన్నీ డే నుండి మూడీ నైట్‌కు షిఫ్ట్ అవ్వండి, సరైన వీక్షణను కనుగొనడానికి కెమెరా యాంగిల్స్‌ను మార్చి మార్చి చూడండి, మీ సబ్జెక్ట్‌ను పాప్ చేయడానికి ఫోకస్‌ను అడ్జస్ట్ చేయండి.

సెకన్లలో స్టయిల్ అప్లయి అయ్యింది.

మీ ఇమేజ్ లుక్‌ను మార్చండి. ఏదైనా రెఫరెన్స్ ఫోటో నుండి ఆకృతిని, రంగును లేదా స్టయిల్‌ను తీసుకొని, దానిని మీ సబ్జెక్ట్‌కు వర్తింపజేయండి. వివిధ రకాల స్టయిల్స్ ను త్వరగా ట్రై చేసి ఎక్స్ పరిమెంట్ చేయడానికి ఇది అత్యంత సులువైన మార్గం.

ఒక విజువల్, పలు సైజులు.

మీ క్రియేషన్లను మీరు షేర్ చేసే ప్రతి చోట ప్రొఫెషనల్‌గా కనిపించేలా చేయండి. మీకు అవసరమైన ఏ ఫార్మాట్‌కు అయినా తగినట్లుగా వాటి సైజ్‌ను తక్షణమే మార్చండి – మీరు ఇష్టపడే వివరాలను క్రాప్ చేయకుండానే ఇదంతా చేయండి.

మీ మాటలు, సరైన స్థానంలో ఆకర్షణీయంగా ప్లేస్ అయ్యాయి.

స్పష్టమైన టెక్స్ట్‌తో లోగోలను, ఆహ్వానాలను, పోస్టర్‌లను, కామిక్స్‌ను, ఇంకా మీకు అవసరమైన వాటిని క్రియేట్ చేయండి. మీ క్రియేషన్‌లో పదాలు, అనేక భాషలలో కూడా, చక్కగా ఇమిడిపోతాయి.

మీ అవసరాలకు తగిన మోడల్‌ను ఎంచుకోండి

Nano Banana

వేగవంతమైన, సాధారణ క్రియేటివిటీకి ఇది ఉత్తమమైన ఎంపిక.

“ఫాస్ట్” మోడల్‌తో
ఇది ఈ కింద పేర్కొన్న ఏరియాలలో అద్భుతంగా పని చేస్తుంది:
క్యారెక్టర్‌లో స్థిరత్వం
వివిధ ఇమేజ్‌లలో ఒక వ్యక్తి లేదా క్యారెక్టర్‌కు సంబంధించిన లుక్‌ను మెయింటెయిన్ చేయడం.
ఫోటోలను కలపడం
ఫోటోలను స్మూత్‌గా బ్లెండ్ చేయడం.
లోకల్ ఎడిట్‌లు
ఇమేజ్‌లోని భాగాలకు వేగంగా, నిర్దిష్ట మార్పులు చేయడం.
Nano Banana Pro

అధునాతన అవుట్‌పుట్‌లు, ఖచ్చితమైన కంట్రోల్ కోసం ఉత్తమమైన ఎంపిక.

“థింకింగ్” మోడల్‌తో
ఇది దాని మునుపటి వెర్షన్ బలం మీద ఆధారపడి, 'ప్రొఫెషనల్-గ్రేడ్ ఫీచర్లు' ఉన్న సూట్‌ను పరిచయం చేస్తోంది. ఇందులో ఇవి కూడా ఉన్నాయి:
కొత్తది
అడ్వాన్స్‌డ్ టెక్స్ట్ రెండరింగ్
స్పష్టమైన, మరింత ఖచ్చితమైన టెక్స్ట్‌తో ఇమేజ్‌లను క్రియేట్ చేయడం.
కొత్తది
ఖచ్చితమైన ఎడిటింగ్ కంట్రోల్స్
లైటింగ్, కెమెరా యాంగిల్, యాస్పెక్ట్ రేషియో (ఆకార నిష్పత్తి) కంట్రోల్ వంటి మీ క్రియేషన్‌లపై మెరుగైన కంట్రోల్‌ను అందిస్తోంది.
కొత్తది
2K రిజల్యూషన్
ప్రొఫెషనల్ వాడకం కోసం తగిన స్పష్టమైన, అధిక రిజల్యూషన్ ఇమేజ్‌లను అందిస్తోంది.
కొత్తది
మెరుగుపరచిన వరల్డ్ నాలెడ్జ్‌
ఇన్‌ఫోగ్రాఫిక్‌లు, డయాగ్రామ్‌ల వంటి వినియోగ సందర్భాల కోసం, మరింత ఖచ్చితమైన, వివరణాత్మక క్రియేషన్‌లను రూపొందించడానికి వీలు కల్పిస్తుంది.
కొత్తది
మరిన్ని ఫోటోలను కలపడం
మరిన్ని ఫోటోలను సజావుగా బ్లెండ్‌ చేయడం.

తరచుగా అడిగే ప్రశ్నలు

Gemini యాప్ అందుబాటులో ఉన్న అన్ని భాషల్లో, దేశాల్లో AI ఇమేజ్ జెనరేషన్ అందుబాటులో ఉంది.

  • Nano Bananaను యాక్సెస్ చేయడానికి, టూల్స్ మెనూలో ”🍌ఇమేజ్‌లను క్రియేట్ చేయండి”ని, మోడల్ మెనూలో “ఫాస్ట్”ను ఎంచుకోండి. ఆపై ఎడిట్ చేయడానికి ప్రాంప్ట్‌ను జోడించండి లేదా ఇమేజ్‌ను అప్‌లోడ్ చేయండి.

  • Nano Banana Proను యాక్సెస్ చేయడానికి, టూల్స్ మెనూలో ”🍌ఇమేజ్‌లను క్రియేట్ చేయండి”ని, మోడల్ మెనూలో “థింకింగ్”ను ఎంచుకోండి. ఆపై ఎడిట్ చేయడానికి ప్రాంప్ట్‌ను జోడించండి లేదా ఇమేజ్‌ను అప్‌లోడ్ చేయండి.

గమనిక: మీరు Nano Banana Pro వినియోగ పరిమితిని చేరుకున్న తర్వాత, ఆటోమేటిక్‌గా Nano Banana ఇమేజ్ మోడల్‌కు మారిపోతారు. ఈ Nano Banana మోడల్ పరిమితిని కూడా చేరుకునే వరకు మీరు దానిని ఉపయోగించవచ్చు.

  1. సింపుల్ ఫార్ములాతో ప్రారంభించండి. <Create/generate an image of>  <subject> <action> <scene>ను ట్రై చేసి, ఆపై దాని నుండి బిల్డ్ చేయండి. ఉదాహరణకు, "కిటికీ అంచున సూర్యుడి కిరణాల్లో కునుకు తీస్తున్న పిల్లి ఇమేజ్‌ను క్రియేట్ చేయి."

  2. మీరు ఎంత ఎక్కువ వివరాలను అందించగలరో, అంత డీటెయిల్డ్ గా చెప్పండి. ప్రాంప్ట్‌లలో మీరు ఆలోచించగల అన్ని నిర్దిష్ట అంశాలను చేర్చాలి, కాబట్టి, "ఎరుపు రంగు డ్రెస్ వేసుకున్న మహిళ ఇమేజ్‌ను క్రియేట్ చేయి" అని చెప్పడానికి బదులుగా, "ఎరుపు రంగు డ్రెస్ వేసుకున్న యువతి పార్క్ గుండా పరిగెడుతున్న ఇమేజ్‌ను క్రియేట్ చేయి" అని ట్రై చేయండి. మీరు ఎంత ఎక్కువ వివరాలను అందిస్తే, మీ సూచనలను ఫాలో అవడంలో Gemini అంత మెరుగ్గా ఉంటుంది.

  3. కంపోజిషన్, స్టయిల్, ఇమేజ్ క్వాలిటీని పరిగణనలోకి తీసుకోండి. మీ ఇమేజ్‌లోని ఎలిమెంట్‌లను ఎలా అమర్చాలనుకుంటున్నారు (కంపోజిషన్), మీరు సాధించాలనుకుంటున్న విజువల్ స్టయిల్ (స్టయిల్), కావలసిన ఇమేజ్ క్వాలిటీ స్థాయి (ఇమేజ్ క్వాలిటీ), అలాగే ఆకార నిష్పత్తి (సైజ్) గురించి ఆలోచించండి. “2:3 ఆకార నిష్పత్తితో ఆయిల్ పెయింటింగ్ స్టయిల్‌లో అంతరిక్షంలో ఎగురుతున్న బ్లర్ అయిన ముళ్ల పంది ఇమేజ్‌ను జెనరేట్ చేయి” వంటి వాటిని ట్రై చేయండి.

  4. క్రియేటివిటీ మీకు సాయం చేస్తుంది. Gemini, ఫ్యాంటసీ ప్రపంచపు వస్తువులను, ప్రత్యేకమైన సీన్స్‌ను క్రియేట్ చేసే విషయంలో అద్భుతంగా పని చేస్తుంది. మీ ఊహలకు రెక్కలు తొడగండి.

  5. మీకు నచ్చనిది ఏదైనా ఉంటే, దానిని మార్చమని Geminiని అడగండి. మా ఇమేజ్ ఎడిటింగ్ మోడల్‌తో మీరు మీ ఇమేజ్‌లపై కంట్రోల్ సాధించవచ్చు. బ్యాక్‌గ్రౌండ్‌ను మార్చమని, ఆబ్జెక్ట్‌ను రీప్లేస్ చేయమని, లేదా ఎలిమెంట్‌ను జోడించమని Geminiని అడగవచ్చు – మీకు కావాల్సిన డిటైల్స్ ఏవీ పోకుండా, ఫోటో మీద మీదైన ముద్ర వేయవచ్చు.

మా AI గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా, ఈ AI ఇమేజ్ జెనరేటర్ బాధ్యతాయుతంగా రూపొందించబడింది. Geminiతో క్రియేట్ చేసిన విజువల్స్‌కు, ఒరిజినల్ హ్యూమన్ ఆర్ట్‌వర్క్‌కు మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉందని నిర్ధారించడానికి, Gemini కనిపించని SynthID వాటర్‌మార్క్‌ను, అలాగే అవి AI ద్వారా జెనరేట్ చేయబడ్డాయని చూపడానికి కనిపించే వాటర్‌మార్క్‌ను ఉపయోగిస్తుంది.

Gemini అవుట్‌పుట్‌లు ప్రధానంగా యూజర్ ప్రాంప్ట్‌ల ద్వారా నిర్ణయించబడతాయి, జెనరేటివ్ AI టూల్ ఏదైనా ఎలా పని చేస్తుందో, అలాగే దీనిలో సైతం, కొంతమంది వ్యక్తులు అభ్యంతరకరంగా భావించే కంటెంట్‌ను జెనరేట్ చేసే సందర్భాలు ఉండవచ్చు. మేము థంబ్స్ అప్/డౌన్ బటన్ల ద్వారా మీ ఫీడ్‌బ్యాక్‌ను వింటూనే ఉంటాము, నిరంతర మెరుగుదలలు చేస్తాము. మరిన్ని వివరాల కోసం, మీరు మా వెబ్‌సైట్‌లో మా విధానం గురించి చదువుకోవచ్చు.

Gemini యాప్‌నకు ఇమేజ్‌ను అప్‌లోడ్ చేసి, అది Google AI ద్వారా జెనరేట్ అయ్యిందా లేదా అని అడగండి. ఈ వెరిఫికేషన్ మా డిజిటల్ వాటర్‌మార్కింగ్ టెక్నాలజీ అయిన SynthID ద్వారా అందించబడుతుంది. ఇది ప్రస్తుతం ఇమేజ్‌లకు అందుబాటులో ఉంది, ఆడియో, వీడియోలకు కూడా త్వరలో సపోర్ట్ అందుబాటులోకి వస్తుంది.

మా బ్లాగ్ పోస్ట్‌లో SynthIDతో AI కంటెంట్‌లో మేము పారదర్శకతను ఎలా పెంచుతున్నాము అనే దాని గురించి మీరు మరింత తెలుసుకోవచ్చు.

అనుకూలత, లభ్యత మారుతూ ఉంటాయి. పరిమితులు వర్తిస్తాయి. 18+.