Gemini Live
Geminiతో Liveలో మాట్లాడండి Gemini Live1 అనేది Geminiతో చాట్ చేయడానికి మరింత సహజమైన మార్గం. మీ ఐడియాల గురించి చర్చించి, మీ ఆలోచనలను ఆర్గనైజ్ చేయడానికి Liveకు వెళ్లండి, లేదా మీ కెమెరాను లేదా స్క్రీన్‌ను షేర్ చేసి, రియల్ టైమ్‌లో, మాట్లాడే సమాధానాలను పొందండి. 45+ భాషల్లో, 150కి పైగా దేశాల్లో మొబైల్ యూజర్‌లకు అందుబాటులో ఉంది.
మీకు కనిపించే దేని గురించి అయినా Geminiతో మాట్లాడండి
ఇప్పుడు మీరు మీ చుట్టూ, లేదా మీ స్క్రీన్‌పై చూస్తున్న దేని గురించి అయినా Geminiతో సంభాషించవచ్చు.
వీడియో
మీరు చూస్తున్న వాటికి సంబంధించిన సహాయాన్ని పొందడానికి ఇప్పుడు మీరు మీ ఫోన్ కెమెరాను షేర్ చేయవచ్చు. మీ అపార్ట్‌మెంట్‌లో ఒక మూలనున్న చిన్న స్థలాన్ని స్టోరేజ్ కోసం ఉపయోగించుకోవడం ఎలా అనే దానికి సంబంధించిన ఐడియాల కోసం, రాత్రి పూట ధరించడానికి అవసరమైన దుస్తులను ఎంచుకోవడంలో సాయపడటానికి, లేదా మీ కాఫీ మెషిన్‌ను రిపేర్ చేయడంలో స్టెప్-బై-స్టెప్ గైడెన్స్ కోసం అడగండి.
స్క్రీన్ షేరింగ్
మీ స్క్రీన్‌పై ఉన్న దేనితోనైనా తక్షణ సహాయం పొందండి. మీ తదుపరి పోస్ట్ కోసం పర్ఫెక్ట్ ఫోటోలను ఎంచుకోవడానికి, మీరు కొనాలనుకుంటున్న కొత్త పర్స్‌పై రెండో అభిప్రాయం (సెకండ్ ఒపీనియన్) గురించి తెలుసుకోవడానికి, లేదా మీ ఫోన్ సెట్టింగ్స్ మెనూ గురించి కూడా మీరు ప్రశ్నలు, సహాయం అడగడానికి, మీ స్క్రీన్‌ను Geminiతో షేర్ చేయండి.
సహజంగా చాట్ చేయండి
విస్తృతంగా చర్చించడానికి Liveకు వెళ్లండి. Gemini మీ సంభాషణా స్టయిల్‌కు అనుగుణంగా మారుతుంది కాబట్టి, అది సమాధానం ఇచ్చేటప్పుడు వాక్యం మధ్యలో మీ మనస్సు మార్చుకున్నా, సులభంగా మార్చి చెప్పవచ్చు, అదనపు ప్రశ్నలు అడగవచ్చు, మల్టీ టాస్క్ చేయవచ్చు. ఇంటర్‌ప్ట్ చేయాలా లేదా సబ్జెక్ట్‌ను మార్చాలా? మీరు సంభాషణను ఏ దిశలో తీసుకెళ్లాలనుకున్నా, Gemini Live సులభంగా ఆ దిశకు మారగలుగుతుంది.
మీ ఆసక్తిని పెంచుకోండి
మీరు వెళ్లాల్సిన ట్రిప్ కోసం మీ ఫ్రెంచ్ భాషను ప్రాక్టీస్ చేస్తున్నా, ఇంటర్వ్యూకు సిద్ధమవుతున్నా, లేదా షాపింగ్ చేసేటప్పుడు సలహా కోసం చూస్తున్నా, ఇనిస్పిరేషన్ వచ్చినప్పుడల్లా ఇన్‌స్టంట్ లెర్నింగ్‌ను అన్‌లాక్ చేయండి. Gemini నుండి కొద్దిగా సహాయం తీసుకుని మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోండి, కొత్త టాపిక్‌లను అన్వేషించండి, అలాగే ఐడియాల గురించి చర్చించండి. మీకు సహాయపడే గైడ్, క్రియేటివ్ పార్ట్‌నర్‌ను మీ చేతివేళ్ల వద్దే పొందే అద్భుతమైన సౌలభ్యాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయండి.
టెక్స్ట్ దాటి మాట్లాడండి
మీ సంభాషణలకు సందర్భాన్ని జోడించండి. మీరు చూసే, వర్క్ చేసే, లేదా చూసే దేని ఆధారంగా అయినా మీకు జెనరేట్ చేసిన సహాయం, ఇన్‌సైట్స్‌ను పొందడానికి Geminiతో షేర్ చేయండి. మీరు చదువుతున్న ఆర్టికల్ గురించి ప్రశ్నలు అడగడం నుండి దశల వారీ ప్రాజెక్ట్ గైడెన్స్‌ను పొందడానికి మీ కెమెరాను షేర్ చేయడం వరకు, మీరు చూస్తున్న వాటి గురించి మరింత సమగ్రమైన, మరింత డైనమిక్ సంభాషణలను క్రియేట్ చేయడానికి Gemini సిద్ధంగా ఉంది.
కనెక్టెడ్ యాప్స్
Gemini Live, మీరు ప్రతిరోజూ ఉపయోగించే యాప్‌లతో ఇంటిగ్రేట్ అవుతుంది, Google Maps, Calendar, Tasks, ఇంకా Keepతో ప్రారంభమవుతుంది. బ్రెయిన్‌స్టార్మ్ చేయండి, ప్లాన్ చేయండి, ఇంకా మీకు అత్యంత ముఖ్యమైన వాటి గురించి సహజమైన, ఇంటరాక్టివ్ పద్ధతిలో లేటెస్ట్ అప్‌డేట్‌లను పొందండి.
ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండండి
- 1.
సమాధానాలు ఖచ్చితంగా ఉన్నాయా లేదా అన్నది చెక్ చేసుకోండి. నిర్దిష్ట ఫీచర్‌లకు, ఖాతాలకు అనుకూలంగా ఉంటుంది. ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం. ఎంపిక చేసిన డివైజ్‌లలో, ఎంపిక చేసిన దేశాలో, భాషలలో, 18 సంవత్సరాలు నిండిన యూజర్‌లకు అందుబాటులో ఉంది.