కొత్త అప్‌డేట్: మా ప్రముఖ మోడల్ అయిన Gemini 2.0 Pro Experimentalను ట్రై చేయండి, ఇది క్లిష్టమైన టాస్క్‌లను పూర్తి చేయడంలో అద్భుతమైన పనితీరును కనబరుస్తుంది. మరింత తెలుసుకోండి
Skip to main content
Gemini Advanced

Googleకు చెందిన నెక్స్ట్-జెనరేషన్ AIని యాక్సెస్ చేసేందుకు మీకు వీలు కల్పించే అద్భుతమైన పాస్

Gemini

Google అందించే మీ వ్యక్తిగత AI అసిస్టెంట్. మీ ఐడియాలను పరుగులు పెట్టించడానికి Geminiతో చాట్ చేయండి.

నెలకు $0 USD
  • మా 2.0 Flash మోడల్‌కు, అలాగే 2.0 Flash Thinking Experimental మోడల్‌కు యాక్సెస్

  • రాయడంలో, ప్లాన్ చేయడంలో, నేర్చుకోవడంలో, ఇమేజ్‌లను జెనరేట్ చేయడంలో సహాయం పొందండి

  • పలు Google యాప్స్‌తో కనెక్ట్ అవ్వండి. Mapsలో, Flightsలో, ఇతర Google యాప్స్‌లో చేయాల్సిన పనులను నేరుగా మీ చాట్‌లోనే పూర్తి చేయండి

  • ప్రయాణంలో ఉన్నప్పుడు Gemini Liveతో సహజ సిద్ధంగా మాట్లాడండి

Gemini Advanced

Googleకు చెందిన నెక్స్ట్-జెన్ AI కోసం మీ ముఖ్యమైన పాస్. Geminiలోని ప్రతి ఫీచర్‌ను, ఇంకా మరిన్నింటిని కలిగి ఉంటుంది.

నెలకు $19.99 USD
$0 USD మొదటి నెలకు
  • మా సరికొత్త Experimental మోడల్ 2.0 Pro‌తో సహా, మా మోడల్స్‌లో అత్యంత సమర్థవంతమైన వాటికి యాక్సెస్

  • Deep Research ద్వారా క్షణాల్లోనే సమగ్రమైన రిపోర్ట్‌లను పొంది సమయాన్ని ఆదా చేసుకోండి

  • 1,500 పేజీల వరకు కంటెంట్ ఉన్న అప్‌లోడ్స్‌తో పుస్తకాలంతటిని, బారెడు పొడవున్న రిపోర్ట్‌లను ఇంకా మరిన్నింటినీ అర్థం చేసుకుని, విశ్లేషించండి

  • Gemsను ఉపయోగించి ఏ రకమైన టాపిక్ కోసం అయినా అనుకూల AI ఎక్స్‌పర్ట్‌లను క్రియేట్ చేయండి, ఉపయోగించండి

  • మీ కోడ్ స్టోరేజ్ లొకేషన్‌కు అప్‌లోడ్ చేసే సామర్థ్యంతో కోడింగ్‌ను మరింత స్మార్ట్‌గా, మరింత వేగంగా రూపొందించండి

  • Google One నుండి 2 TB స్టోరేజ్‌తో వస్తోంది*

  • Gmail, Docs, ఇంకా మరిన్ని ప్రోడక్టులలో Geminiయాక్సెస్‌తో మీ ఫేవరైట్ Google యాప్స్‌ను ఉపయోగించి అవాంతరాలు లేకుండా వర్క్ చేయండి* (ఎంపిక చేసిన భాషల్లో అందుబాటులో ఉంది)

*Google One AI ప్రీమియమ్ ప్లాన్‌లో భాగంగా మీ సబ్‌స్క్రిప్షన్‌తో పాటుగా అందించబడుతుంది

Geminiకి చెందిన సరికొత్త ఫీచర్‌లకు ముందస్తు (ప్రయారిటీ) యాక్సెస్‌ను అన్‌లాక్ చేయండి

Gemini Advancedతో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో Google రూపొందించిన కొత్త టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చాక మీరు వాటిని అందరి కంటే ముందుగా ట్రై చేసే అవకాశాన్ని పొందవచ్చు, వీటి ద్వారా అత్యంత క్లిష్టమైన మీ ప్రాజెక్ట్‌లను కూడా సులభంగా పూర్తి చేసుకోవచ్చు.

మా అత్యంత శక్తిమంతమైన ప్రయోగాత్మక మోడళ్లను మొదటగా ట్రై చేసే వారిలో మీరూ ఒకరు అవ్వండి

క్లిష్టమైన టాస్క్‌లను అద్భుతంగా పూర్తి చేయగలిగేలా డిజైన్ చేసినటువంటి మా ప్రముఖ మోడల్ 2.0 Proకు చెందిన ఎక్స్‌పరిమెంటల్ వెర్షన్ ప్రివ్యూ చూడండి. అడ్వాన్స్‌డ్ కోడింగ్ ఛాలెంజ్‌లను పరిష్కరించడం నుండి స్కూల్ లేదా వ్యక్తిగత ప్రాజెక్ట్‌లకు సంబంధించిన లెక్కల సమస్యలను పరిష్కరించడం వరకు, అత్యంత క్లిష్టమైన టాస్క్‌లను కూడా హ్యాండిల్ చేసి, వాటిని మరింత సౌలభ్యంతో పరిష్కరించడంలో మీకు సహాయపడేందుకు కోడింగ్, మ్యాథ్స్ ప్రాంప్ట్‌లకు మరింత వాస్తవికమైన, మెరుగైన సామర్థ్యాన్ని అందిస్తోంది.1

పూర్తి సమాచారాన్ని అందించే మల్టీ పేజీ రిపోర్ట్‌లను నిమిషాల్లో జెనరేట్ చేస్తుంది

డీప్ రీసెర్చ్‌ను ఉపయోగించి ఏదైనా టాపిక్‌పై తాజా సమాచారాన్ని పొందండి. ఇది మీ ప్రాంప్ట్‌ను మల్టీ-పాయింట్ రీసెర్చ్ ప్లాన్‌గా మారుస్తుంది. తాజా సమాచారం కోసం వందలాది సైట్‌లను ఆటోమేటిక్‌గా బ్రౌజ్ చేయగలదు. ఎక్కువ ఇన్‌సైట్స్‌తో కూడిన సమగ్రమైన రిపోర్ట్‌లను క్రియేట్ చేయగలదు—ఇవన్నీ నిమిషాల్లో చేయగలదు.2

పెద్ద రిపోర్ట్‌లను, టెక్స్ట్‌బుక్‌లను, ఇంకా మరిన్నింటిని క్షణాల్లోనే వివిధ భాగాలుగా విడగొట్టండి

10 లక్షల టోకెన్ల కాంటెక్స్ట్ విండోతో, 1500 పేజీల వరకు టెక్స్ట్‌ను లేదా 30 వేల లైన్ల కోడ్‌ను Gemini Advanced ఏకకాలంలోనే ప్రాసెస్ చేయగలదు, దీని వల్ల మీరు మునుపెన్నడూ లేని రీతిలో మరింత క్లిష్టమైన సమస్యలను సమర్ధవంతంగా అన్వేషించి, అందులోని సమాచారాన్ని విశ్లేషించి, పరిష్కరించేందుకు అవకాశం కలుగుతుంది.

మీ కోడింగ్ వర్క్‌ఫ్లోలను స్ట్రీమ్‌లైన్ చేసుకోండి

మీ కోడింగ్ వర్క్‌ఫ్లోలను స్ట్రీమ్‌లైన్ చేసుకోవడానికి మీ పరికరం నుండి నేరుగా మీ కోడ్ స్టోరేజ్ లొకేషన్‌ను అప్‌లోడ్ చేయండి. వేలాది కోడ్ లైన్‌ల నుండి ఇన్‌స్టంట్ గణాంకాలను పొందండి, తెలివైన మార్పులను చేయండి, ఎర్రర్‌లను డీబగ్ చేయండి, ఇంకా గరిష్ఠ స్థాయిలో పనితీరు కోసం మీ కోడ్‌ను ఆప్టిమైజ్ చేయండి, అన్నీ ఒకే యూజర్-ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్‌లో.

అధునాతన టాస్క్‌లలో హెల్ప్ కోసం, అధునాతన AI

మీరు కాలేజీ అడ్మిషన్ల కోసం అప్లయి చేస్తున్నా, కెరీర్లను మార్చుకుంటున్నా, కొత్త క్రియేటివ్ ఐడియాలతో ఏదైనా పనిని స్టార్ట్ చేస్తున్నా, లేదా ఏదైనా ఒక సైడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలని చూస్తున్నా, కొన్ని సందర్భాల్లో మీకు కొద్దిగా సహాయం అవసరం పడవచ్చు.

అందరికంటే ముందుండటానికి త్వరగా నేర్చుకోండి, లోతుగా తెలుసుకోండి, తెలివిగా సిద్ధమవ్వండి.

క్లిష్టమైన కాన్సెప్ట్‌లను విడదీయండి, దశలవారీగా పరిష్కారాలను పొందండి, అలాగే క్లిష్టమైన టాపిక్‌లకు సంబంధించి మీ అవగాహనను మెరుగుపరుచుకోవడానికి ప్రత్యేకంగా మీకు తగ్గట్టుగా ఉండే ఫీడ్‌బ్యాక్‌తో ప్రాక్టీస్ క్వశ్చన్‌లను జెనరేట్ చేయండి.

మీ కోసం నిమిషాల్లో సమగ్రమైన రీసెర్చ్ రిపోర్ట్‌లను జెనరేట్ చేయడానికి Deep Research ద్వారా రియల్ టైంలో వందలాది సోర్స్‌లను విశ్లేషించే అవకాశం Geminiకి ఇవ్వండి, ఇది గంటల తరబడి సెర్చ్ చేయాల్సిన అవసరం లేకుండా మీ వ్యాసాలు, ప్రాజెక్ట్‌లను వెంటనే ప్రారంభించేందుకు కావలసిన ఉత్తేజాన్ని మీకు అందిస్తుంది.

Gemsకు యాక్సెస్ ద్వారా, మీ లెసన్ ప్లాన్‌లు, టెక్ట్స్‌బుక్స్ ఆధారంగా మీ సొంత వ్యక్తిగత అధ్యయన పార్ట్‌నర్‌ను బిల్డ్ చేసుకోవడానికి మీ ఫైల్స్‌ను మీరు ఉపయోగించవచ్చు, మీ స్టయిల్‌కు తగ్గట్టుగా మరింత సమర్థవంతంగా నేర్చుకోవడానికి సమాధానాలను, ప్రాక్టీస్ మెటీరియల్స్‌ను, మొదటి డ్రాఫ్ట్‌లను త్వరగా జెనరేట్ చేయడంలో ఇది మీకు వీలు కల్పిస్తుంది.

మొత్తం టెక్స్ట్‌బుక్స్‌ను, మీ థీసిస్‌ను, లేదా టెక్నికల్ డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేసి, పలు చాప్టర్‌లలో ఉన్న లేదంటే మొత్తం బుక్‌లోని ప్రశ్నలను అడగండి. ఇకపై పేజీలను తిప్పడం లేదా బుక్‌లో ఏ పేజీలో ఉన్నారో మిస్ అవ్వడం జరగదు - పూర్తి సమాచారాన్ని, సునిశితమైన వివరాలు, అన్నింటినీ ఒకేసారి పొందండి.

Renaissance style painting
Study icon
Your study partner

ఐడియాల రూపకల్పన నుండి క్రియేషన్ వరకు - అత్యంత క్లిష్టమైన మీ ప్రాజెక్ట్‌లను సైతం త్వరగా పూర్తి చేయండి

Deep Researchతో, పోటీదారులకు సంబంధించిన లోతైన సమాచారం నుండి పరిశ్రమ ఓవర్‌వ్యూ‌ల వరకు – మీ కోసం నిమిషాల్లో సమగ్రమైన రీసెర్చ్ రిపోర్ట్‌లను జెనరేట్ చేయడానికి రియల్ టైంలో వందలాది సోర్స్‌లను Gemini విశ్లేషించగలదు – తద్వారా సెర్చ్ చేయడంలో తక్కువ సమయాన్ని వెచ్చించి, మరింత ఎక్కువ సమయం పని చేసేలా మీకు వీలు కల్పిస్తుంది.

Gemsకు యాక్సెస్ ద్వారా, మీ సరికొత్త కాన్సెప్ట్‌లపై క్షణాల్లో విస్తృతమైన ఫీడ్‌బ్యాక్‌ను పొందడానికి, మీ స్టయిల్‌లో రాసిన మొదటి డ్రాఫ్ట్‌లను జెనరేట్ చేయడానికి, ఇంకా మరిన్నింటి కోసం ప్రేక్షకులు, నిపుణుల గణాంకాల ఆధారంగా ఐడియాలను లోతుగా చర్చించే మీ సొంత పార్ట్‌నర్‌ను మీరు క్రియేట్ చేయవచ్చు.

కస్టమర్ ఫీడ్‌బ్యాక్ నుండి బిజినెస్ ప్లాన్‌లు, ఇంకా మరిన్నింటి వరకు - గరిష్ఠంగా 1,500 పేజీల మీ డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేయండి - మీ డేటాను విశ్లేషించడంలో, కీలక గణాంకాలను కనుగొనడంలో, ఇంకా చార్ట్‌లను కూడా క్రియేట్ చేయడంలో నిపుణుల స్థాయి సహాయాన్ని పొందండి, ఇది మీ నిర్దిష్ట ప్రాజెక్ట్‌లకు అనుగుణంగా మీ ఇంటరాక్షన్‌లను సులభతరం చేస్తుంది.

Your ideas generator

మీ కోడింగ్ ప్రొడక్టివిటీని బూస్ట్ చేసుకోండి

నెక్స్ట్-జెనరేషన్ కోడింగ్ సామర్థ్యాలతో మొత్తం కోడ్ బ్లాక్‌లను డెవలప్ చేయండి, యూనిట్ టెస్ట్‌లను జెనరేట్ చేయండి, ఇంకా రిపీట్ అయ్యే కోడింగ్ టాస్క్‌లను ఆటోమేట్ చేయండి, ఇది మీకు ఉన్నత స్థాయి డిజైన్, ఆర్కిటెక్చర్‌పై ఫోకస్ చేయడానికి వీలు కల్పిస్తుంది.

మీ కోడ్ స్టోరేజ్ లొకేషన్‌ను, గరిష్ఠంగా 30k లైన్‌ల కోడ్‌ను అప్‌లోడ్ చేయండి, ఉదాహరణల ద్వారా రీజనింగ్ ఇవ్వడానికి, సహాయకరమైన మార్పులను సూచించడానికి, క్లిష్టమైన కోడ్ బేస్‌లను డీబగ్ చేయడానికి, పెద్ద ఎత్తున పనితీరు మార్పులను ఆప్టిమైజ్ చేయడానికి, ఇంకా కోడ్‌లోని వివిధ భాగాలు ఎలా పని చేస్తాయనే దాని గురించి వివరణలు ఇవ్వడానికి Gemini Advanced‌కు అవకాశం ఇవ్వండి.

సహకారంతో కూడిన AI వాతావరణంలోనే, వ్యక్తిగత ప్రాజెక్ట్‌లు లేదా దీర్ఘకాలిక డెలప్‌మెంట్ కోసం మీ నైపుణ్యాలకు పదును పెట్టడంలో మీకు సహాయపడటానికి మీ కోడ్ విషయంలో పరిష్కారాలపై లోతుగా చర్చించండి, డిజైన్ ఐడియాల గురించి చర్చించండి, ఇంకా రియల్ టైంలో ఫీడ్‌బ్యాక్‌ను పొందండి.

Code example
Your code generator

మీరు Gmail, Docs, ఇంకా మరిన్నింటిలో, Geminiకి యాక్సెస్‌తో పాటు Google One నుండి 2 TB స్టోరేజ్, ఇతర ప్రయోజనాలను కూడా పొందుతారు

Gmail icon

Gmailలో, Docsలో, అలాగే మరిన్ని ప్రోడక్ట్‌లలో Gemini

మీ రోజువారీ టాస్క్‌లను సులభతరం చేసుకోండి, అలాగే నేరుగా మీకు ఇష్టమైన Google యాప్‌లలో రాయడం, ఆర్గనైజ్ చేయడం, విజువలైజ్ చేయడంలో సహాయం పొందండి (ఎంపిక చేసిన భాషల్లో అందుబాటులో ఉంటుంది).

Image showing Gemini in Gmail
Google One icon

2 TB Google One స్టోరేజ్

Google Drive, Gmail, ఇంకా Google Photos అంతటా ఉపయోగించడానికి 2 TB స్టోరేజ్‌తో మీ జ్ఞాపకాలను, ఫైల్స్‌ను బ్యాకప్ చేసుకోండి. అంతేకాకుండా, Google ప్రోడక్ట్‌ల అంతటా మరిన్ని ప్రయోజనాలను ఆస్వాదించండి.

Image of storage usage in Google One
NotebookLM Plus icon

NotebookLM Plus

మీరు అందించే సమాచారం నుండి క్లిష్టమైన గణాంకాలను త్వరగా పొందడంలో మీకు సహాయపడటానికి NotebookLM Plusతో అధిక వినియోగ పరిమితులను, ప్రీమియం ఫీచర్‌లను అన్‌లాక్ చేయండి.

Image showing various data sources that can be used in NotebookLM Plus

1-నెల ఉచిత ట్రయల్‌ను ప్రారంభించండి

తరచుగా అడిగే ప్రశ్నలు

Google వారి నెక్స్ట్-జెనరేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు (AIకి) Gemini Advanced మీకు పూర్తి యాక్సెస్‌ను అందిస్తుంది. దీని ద్వారా అత్యంత క్లిష్టంగా ఉండే మీ ప్రాజెక్ట్‌లను హ్యాండిల్ చేయండి. అత్యంత సమర్థవంతమైన మా AI మోడల్స్‌ను ఎక్స్‌పీరియన్స్ చేయండి. వీటిలోని కొత్త ఫీచర్‌లకు ముందస్తు యాక్సెస్‌ను పొందండి. ఇవి 10 లక్షల టోకెన్‌లు ఉన్న కాంటెక్స్ట్ విండోతో అందుబాటులో ఉన్నాయి.

Google One AI ప్రీమియమ్ ప్లాన్‌లో భాగంగా అత్యంత సమర్థవంతమైన మా AI మోడల్స్‌తో కూడిన Gemini Advanced, 18 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు గల యూజర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది ఈ ప్లాన్‌లో ఇవి కూడా అందుబాటులో ఉంటాయి:

  • Gmailలో, Docsలో, అలాగే మరిన్ని ప్రోడక్ట్‌లలో Gemini

  • 2 TB స్టోరేజ్

  • అలాగే ఇతర ప్రయోజనాలు

అంతే కాకుండా, మీరు సొంతంగా మేనేజ్ చేసుకొనే వ్యక్తిగత Google ఖాతా మీకు అవసరం అవుతుంది. అప్‌గ్రేడ్ చేయడం ఎలా

కొత్త Google One AI ప్రీమియమ్ ప్లాన్‌లో భాగంగా అత్యంత సమర్థవంతమైన మా AI మోడల్స్‌తో కూడిన Gemini Advanced, 18 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు గల యూజర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది ఈ ప్లాన్‌లో ఇవి కూడా అందుబాటులో ఉంటాయి:

  • Gmailలో, Docsలో, అలాగే మరిన్ని ప్రోడక్ట్‌లలో Gemini

  • 2 TB స్టోరేజ్

  • అలాగే ఇతర ప్రయోజనాలు

అంతే కాకుండా, మీరు సొంతంగా మేనేజ్ చేసుకొనే వ్యక్తిగత Google ఖాతా మీకు అవసరం అవుతుంది.

ఒకవేళ మీకు అర్హత ఉంటే, మీరు ఇప్పుడే Gemini Advancedకు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. మీరు నేరుగా Gemini యాప్స్ నుండి కూడా అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు: మెనూలో మీకు ఒక అప్‌గ్రేడ్ బటన్ కనబడుతుంది.

అవును, చేస్తుంది. అయితే, Gemini మొబైల్ యాప్, Gemini వెబ్ యాప్ మధ్య కొన్ని ఫీచర్లలో తేడాలు ఉండవచ్చు. అప్‌గ్రేడ్ చేసుకోవడం ఎలా

మీ Gemini Advanced సబ్‌స్క్రిప్షన్‌ను మొబైల్ యాప్‌లో మేనేజ్ చేయాలనుకుంటే, సెట్టింగ్‌ల మెనూను యాక్సెస్ చేయడానికి మీ ప్రొఫైల్ ఫోటోపై ట్యాప్ చేయండి.

సరైన టాస్క్ కోసం సరైన మోడల్‌ను ఉపయోగిస్తున్నట్లు మేము భావిస్తున్నాము. మేము అత్యుత్తమ ఎక్స్‌పీరియన్స్‌ను అందించగలమని భావించే వాటి ఆధారంగా నిర్దిష్ట టాస్క్‌ల కోసం అందుబాటులో ఉన్న వివిధ మోడల్స్‌ను ఉపయోగిస్తాము.

Gemini Advanced ద్వారా, మేము డెవలప్ చేసిన అత్యంత సమర్థవంతమైన AI మోడల్స్‌ను మీరు యాక్సెస్ చేయవచ్చు.

మీ ట్రయల్ గడువు ముగిసేలోపు ఎప్పుడైనా Google One AI ప్రీమియమ్ సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేయండి. చట్టం ప్రకారం తప్పనిసరి అయితే మినహా పాక్షిక బిల్లింగ్ వ్యవధుల విషయంలో రీఫండ్‌లు లభించవు. సబ్‌స్క్రయిబ్ చేసుకోవడం ద్వారా, మీరు Google OneGoogleఆఫర్‌లకు చెందిన నియమాలకు అంగీకరిస్తున్నారు. Google, డేటాను ఎలా హ్యాండిల్ చేస్తుంది అనే విషయం గురించి తెలుసుకోండి. Gemini Advancedతో పాటు "Gmailలో, Docsలో అలాగే మరికొన్నింటిలో Gemini" కేవలం 18 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే అందుబాటులో ఉన్నాయి. "Gmailలో, Docsలో అలాగే మరికొన్నింటిలో Gemini" ఎంచుకున్న భాషల్లో అందుబాటులో ఉంటుంది. రేట్ల పరిమితులు వర్తించవచ్చు.

  • 1

    మా approach & guidelinesను అనుసరించి భద్రత పరంగా మా ఎక్సపరిమెంటల్ మోడల్స్‌లో తగు జాగ్రత్తలు తీసుకున్నాం. ఈ మోడల్స్ ప్రి-రిలీజ్ ప్రివ్యూ కోసం ఉద్దేశించినవి. ఆశించిన విధంగా పని చేయకపోవచ్చు. అంతేకాకుండా, కొన్ని Gemini ఫీచర్‌లు ఈ మోడల్స్‌కు ఎక్సపరిమెంటల్ దశలో అనుకూలంగా ఉండవు.

  • 2

    డివైజ్‌ను, దేశాన్ని, భాషను బట్టి లభ్యత (అవైలబిలిటీ) మారే అవకాశం ఉంది. ఫలితాలు ఉదాహరణ కోసం మాత్రమే. ఇవి మారే అవకాశం ఉంది. సమాధానాలు ఖచ్చితంగా ఉన్నాయా లేదా అన్నది చెక్ చేసుకోండి.