ఇంట్రడ్యూస్ చేస్తున్నాం Gemini, మీ కొత్త పర్సనల్ AI అసిస్టెంట్
2016 నుండి, లక్షలాది మంది ప్రజలు తాము ప్రయాణం చేసే సమయంలో తమ ఫోన్ల ద్వారానే మరిన్ని పనులను చక్కబెట్టుకోగలిగేలా Google Assistant సహాయపడింది. అలా సాయపడే క్రమంలో మీ అసిస్టెంట్ నుండి మీరు అదనపు ఫంక్షనాలిటీని కోరుకుంటున్నారని మాకు తెలియజేశారు. ఆ అసిస్టెంట్ మీ కోసం వ్యక్తిగతీకరించబడి ఉండాలని, దానితో మీరు సహజంగా మాట్లాడగలగాలని, దాని ద్వారా మరికొన్ని పనులను పూర్తి చేసుకోగలగాలి అని కోరుకుంటున్నట్టు మాకు తెలిసింది. అందుకే, మీ ఫోన్‌లో ఉండే ఒక అసిస్టెంట్ ఏం చేయగలదు అనే విషయాన్ని మేము పూర్తిగా కొత్తగా డిజైన్ చేశాము. దీన్ని, Googleకు చెందిన అత్యంత సమర్థవంతమైన AI మోడల్స్‌తో రీబిల్డ్ చేశాము.
Gemini, ఒక కొత్త రకమైన AI అసిస్టెంట్. పూర్తిగా కొత్త ఆలోచనలో దీన్ని బిల్డ్ చేశాం. భాషను అర్థం చేసుకోవడంలో, రీజనింగ్‌లో ఇది అత్యాధునికంగా ఉంది. Gemini పట్ల మేము చాలా ఎగ్జయిటింగ్‌గా ఉన్నాము. మీకు ఎంతగానో నచ్చే Google Assistantలోని హ్యాండ్స్-ఫ్రీ ఎక్స్‌పీరియన్స్‌ను అందించడమే కాకుండా Gemini మరెన్నో చేయగలదు. ఇది మాటలను అర్థం చేసుకోవడంతో పాటు సంక్లిష్టమైన టాస్క్‌లను హ్యాండిల్ చేయడంలో మీకు సహాయం చేస్తుంది. సైడ్-బై-సైడ్ పరీక్షల్లో, సహజమైన భాషను అర్థం చేసుకోవడంలో మెరుగ్గా ఉందని, అందువల్ల Gemini సక్సెస్ రేటు ఎక్కువగా ఉందని యూజర్లు చెప్పడం మేము గమనించాము.
Google Assistantతో పోలిస్తే Gemini ఎలా పని చేస్తుంది, అది ఎటువంటి కొత్త మార్గాల్లో మీకు సాయం చేయగలదో ఇక్కడ పేర్కొన్నాము. Geminiని అత్యంత సహాయకరమైన, వ్యక్తిగతీకరించిన AI అసిస్టెంట్‌గా రూపొందించాలని భావిస్తున్నాము. అందుకోసం, మీరిచ్చే ఫీడ్‌బ్యాక్‌తో దానిని వేగంగా మెరుగుపరచడమే ఏకైక లక్ష్యంగా పని చేస్తున్నాము. మేము చేసే మెరుగుదలలను ఈ పేజీలో జోడించి అప్‌డేట్ చేస్తాము. మరికొన్ని వార్తల కోసం Gemini రిలీజ్ అప్‌డేట్స్ పేజీని మీరు ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చు.
Geminiని, Google Assistantతో పోల్చి చూస్తే
Gemini నిజంగా అద్భుతాలు చేయగలదు. AIతో మాట్లాడటం, దాని ద్వారా పనులు చేయించుకోవడం అనే అంశాలకు సంబంధించి ఒక ఫండమెంటల్ షిఫ్ట్‌ను (ప్రాథమిక మార్పును) సూచిస్తుంది. మీరు Geminiని ఉపయోగించడాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు:
సహజంగా మాట్లాడే భాషను Gemini అర్థం చేసుకోగలదు. అందువల్ల మీరు మీ PAతో మాట్లాడినట్లు, దానితో మాట్లాడవచ్చు, లేదా ఏదైనా రాసి చెప్పవచ్చు.
Gemini భారీ డేటా మీద, అత్యాధునికమైన AI మోడల్స్ మీద ఆధారపడి బిల్డ్ అయింది. అంటే ఇది కొన్ని సింపుల్ రిక్వెస్ట్‌లకు సంబంధించి Google Assistant కన్నా ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఈ అంశం మీద మేము చురుగ్గా పని చేస్తున్నాం. Gemini మరింత వేగంగా పని చేసే ప్రయత్నాల్లో ఉన్నాము.
Google Assistantతో పోలిస్తే Gemini, ఎక్కువ ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలదు. అయితే ప్రతిసారి సరైన సమాధానాలు ఇవ్వలేకపోవచ్చు. డబుల్-చెక్ ఫీచర్ ద్వారా Gemini ఇచ్చిన సమాధానాలను మీరు చెక్ చేసుకోవచ్చు. Gemini తాను ఇచ్చే సమాధానాల్లో పేర్కొన్న సోర్సులను రివ్యూ చేయవచ్చు. లేదా అత్యంత ముఖ్యమైన అంశాలపై సమాచారం కోసం Google Searchను ఉపయోగించవచ్చు.
Google Assistantలో పాపులర్‌గా ఉన్న ఫీచర్లలో ఏవేవి ఇప్పుడు Geminiలో అందుబాటులో ఉన్నాయి, లేదా త్వరలో అందుబాటులోకి రానున్నాయి అన్న అంశానికి సంబంధించిన లిస్ట్ ఇదిగోండి. దయచేసి గమనించండి: ఈ లిస్ట్ కేవలం మీ ఫోన్‌కు లేదా ఎలిజిబిలిటీ ఉన్న ఇతర Android పరికరాలకు మాత్రమే వర్తిస్తుంది.
ఈవెంట్లు, రిమైండర్లు & లిస్ట్‌లు
(Calendar, Keep & Tasks)
వీడియో గురించి అడగండి (YouTube)
(YouTube Music)
మీ ఫోన్‌ను కంట్రోల్ చేయండి (ఉదా., యాప్‌లు తెరవడం, వెబ్‌సైట్‌లు, కెమెరా, సెట్టింగ్‌లు)
మీ ఫోన్ లాక్‌లో ఉన్నప్పుడు: సమాధానాలు పొందండి, అలారాలు & టైమర్లు సెట్ చేయండి, మీడియా ప్లేబ్యాక్‌ను కంట్రోల్ చేయండి, పరికర సెట్టింగ్‌లు & రొటీన్ విషయాలను కంట్రోల్ చేయండి
మీ ఫోన్ లాక్‌లో ఉన్నప్పుడు: అదనపు ఫీచర్స్ (ఉదా., ఈమెయిల్, కాల్స్, మెసేజెస్, రిమైండర్స్, స్మార్ట్ హోమ్ కంట్రోల్)
| ఫీచర్ | Gemini లభ్యత |
|---|---|
ఈవెంట్లు, రిమైండర్లు & లిస్ట్‌లు (Calendar, Keep & Tasks) | |
వీడియో గురించి అడగండి (YouTube) | |
(YouTube Music) | |
మీ ఫోన్‌ను కంట్రోల్ చేయండి (ఉదా., యాప్‌లు తెరవడం, వెబ్‌సైట్‌లు, కెమెరా, సెట్టింగ్‌లు) | |
మీ ఫోన్ లాక్‌లో ఉన్నప్పుడు: సమాధానాలు పొందండి, అలారాలు & టైమర్లు సెట్ చేయండి, మీడియా ప్లేబ్యాక్‌ను కంట్రోల్ చేయండి, పరికర సెట్టింగ్‌లు & రొటీన్ విషయాలను కంట్రోల్ చేయండి | |
మీ ఫోన్ లాక్‌లో ఉన్నప్పుడు: అదనపు ఫీచర్స్ (ఉదా., ఈమెయిల్, కాల్స్, మెసేజెస్, రిమైండర్స్, స్మార్ట్ హోమ్ కంట్రోల్) | |
ఇతర మెసేజింగ్ యాప్‌లు | |
PDF గురించి అడగండి (Android with Gemini in Pro) |
Geminiని కలిసి మెరుగుపరుద్దాం
మీ ఫీడ్‌బ్యాక్ ద్వారా మేము నిరంతరం నేర్చుకుంటూ Geminiని మరింత వేగవంతంగా సమర్థవంతంగా చేయడానికి కృషి చేస్తున్నాము, ప్రతిసారీ మేము సరైన మార్గాన్ని అనుసరించకపోవచ్చు. Gemini కోసం ఆసక్తికరమైన సరికొత్త సామర్థ్యాలను రూపొందించడానికి పని చేస్తూనే, ప్రత్యేకంగా Google Assistant మీద ఆధారపడి ఉన్నవారికోసం రోజువారీ ఎక్స్‌పీరియెన్స్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము.
ఏదైనా Gemini సమాధానానికి బాగుంది (థంబ్స్ అప్) లేదా బాగాలేదు (థంబ్స్ డౌన్) అని సూచించడం, మీ ఆలోచనలను పంచుకోవడం ద్వారా మీ ఫీడ్‌బ్యాక్‌ను ఇవ్వండి. మేము మీ నుండి వాటిని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాము.
నిర్దిష్ట భాషల్లో, దేశాల్లో ఎంపిక చేసిన పరికరాలు, అనుకూల ఖాతాల్లో (కంపాటిబుల్ అకౌంట్స్‌లో) ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి; అనుకూల (కంపాటిబుల్) కంటెంట్‌తో ఫీచర్స్ పని చేస్తాయి. ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న Android పరికరం కావాలి. దాన్ని సెట్-అప్ చేసి ఉండాలి. ఖచ్చితత్వం కోసం సమాధానాలను పరిశీలించండి..
FAQ
You can download Gemini from the Google Play store or Apple App Store and begin using the upgraded experience at any time.
దిగువున ఉన్న ప్రశ్నలన్నిటికీ మీరు అవును అని సమాధానం ఇచ్చినట్లయితే, రాబోయే నెలల్లో మీ డివైజ్ Assistant నుండి Geminiకి అప్‌గ్రేడ్ అవుతుంది:
మీ డివైజ్ మొబైల్ ఫోన్ లేదా టాబ్లెట్ అయితే:
మీ డివైజ్‌లో కనీసం 2GB RAM ఉందా?
Gemini అందుబాటులో ఉన్న 200+ దేశాల్లో ఏదో ఒక దానిలో మీరు నివసిస్తున్నారా?
Android కోసం: మీ డివైజ్‌లో Android 9 లేదా దాని కంటే తాజా వెర్షన్ ఉందా?
iOS కోసం: మీ డివైజ్‌లో iOS 16 లేదా దాని కంటే తాజా వెర్షన్ ఉందా?
Android Goను ఉపయోగించే డివైజ్‌ల యూజర్లు ప్రస్తుతం Geminiని ఉపయోగించడం సాధ్యపడదు.
మీ వద్ద ఉన్న డివైజ్ హెడ్‌ఫోన్స్ అయితే: మీ హెడ్‌ఫోన్స్‌లోని డిజిటల్ అసిస్టెంట్, మీ మొబైల్ డివైజ్‌లోని డిజిటల్ అసిస్టెంట్‌తో మ్యాచ్ అవుతుంది.
Geminiని ఉపయోగించుకుని స్పీకర్లు, డిస్‌ప్లేలు అలాగే టీవీల వంటి ఇంటి డివైజ్‌లకు కూడా మేము సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ను పరిచయం చేయబోతున్నాము. కొన్ని నెలల్లో దీనికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తాము. అప్పటి వరకు, ఈ డివైజ్‌లలో Google Assistant పని చేయడం కొనసాగుతుంది.
Gemini అనేది AI-అందించే మా అసిస్టెంట్, ఇది మీరు అభిమానించే Google Assistant అందించే హ్యాండ్స్-ఫ్రీ సహాయాన్ని అందిస్తుంది, కానీ సంభాషణల పరంగా, అలాగే క్లిష్టమైన టాస్క్‌ల విషయంలో మరింతగా సాయం చేయగలదు.
ఈ సహాయకరమైన చార్ట్‌లో Google Assistant ద్వారా మీరు ఎక్స్‌పీరియన్స్ పొందిన చాలా ఫీచర్లు, అలాగే వాటిని Gemini ఇంకా ఎంత మెరుగుపరిచింది అనే వివరాలు ఉన్నాయి.
దాంతో పాటు, Gemini అనేది సహజసిద్ధమైన, స్వతంత్రంగా వ్యవహరించే మల్టీ-మోడల్, కాబట్టి మీరు Geminiతో సహజసిద్ధమైన సంభాషణలను చేయవచ్చు, అది మీ తరఫున టాస్క్‌లను పూర్తి చేస్తుంది.
“Ok Google” అనేది హాట్‌వర్డ్‌గా కొనసాగుతుంది.
మేము యూజర్లను Geminiకి అప్‌గ్రేడ్ చేసే క్రమంలో, ఒకవేళ సదరు డివైజ్‌లో Gemini అందుబాటులో ఉంటే “Ok Google” అనేది Gemini కోసం హాట్‌వర్డ్‌గా పని చేస్తుంది.
Gemini ఇంకా అందుబాటులో లేని ఇతర కేసుల్లో “Ok Google” అనే హాట్‌వర్డ్‌ను వాడితే Google Assistant యాక్టివేట్ అవడం కొనసాగుతుంది.
ఈ అప్‌గ్రేడ్ వీలైనంత సజావుగా జరిగేందుకు వీలుగా, మీ డివైజ్‌ను Geminiకి అప్‌గ్రేడ్ చేసేటప్పుడు Google Assistantలో సేవ్ అయి ఉన్న కొన్ని ప్రాధాన్యతలను, హిస్టరీని మేము ఉపయోగిస్తాము. ఉదాహరణకు, దాదాపు అన్ని దేశాల్లో మీరు Geminiకి మారినప్పుడు Google Assistantలోని మీ కాల్స్ హిస్టరీ, మెసేజ్‌ల హిస్టరీని ఆటోమేటిగ్గా చెక్ చేస్తాము. తద్వారా Geminiలో మీరు ఎవరికి కాల్ చేయాలని అనుకుంటారు, ఎవరికి మెసేజ్ చేయాలని అనుకుంటారు అన్నది మెరుగ్గా గుర్తించగలుగుతాము.