మీ హిస్టరీని Geminiకి బదిలీ చేయండి
మొదటి నుండి ప్రారంభిస్తున్న ఫీలింగ్ కలగకుండా Geminiని ట్రై చేయడానికి సిద్ధంగా ఉన్నారా? మీ AI చాట్‌ను, మెమరీలను మీతో పాటే తెచ్చుకోండి.
కేవలం కొన్ని క్లిక్‌లతోనే మీ మెమరీలను పొందండి
మరొక AI యాప్ నుండి మీ మెమరీలను బదిలీ చేసుకోవడం చాలా సులభం. అదెలా చేయాలో Gemini మీకు వివరించగలదు.
మీ ప్రాధాన్యతలను సేవ్ చేయండి
మీ అనుకూల సూచనలను మీతో పాటు తెచ్చుకోండి. మీ ప్రాధాన్యతలను Gemini మెమరీ సెట్టింగ్‌లలో పేస్ట్ చేయండి చాలు, ఇక అంతా సెట్ అయినట్లే.
మీ చాట్ హిస్టరీని బదిలీ చేయండి
వేరే AI యాప్ నుండి మీ డేటాను ఎగుమతి చేసి, ఆ .జిప్ ఫైల్‌ను Geminiలోకి అప్‌లోడ్ చేయండి. మీ గత థ్రెడ్‌లను Gemini సురక్షితంగా ఆర్గనైజ్ చేస్తుంది, తద్వారా మీరు ఆపిన చోటు నుండే కొనసాగించవచ్చు.
చాలా సింపుల్. మీ AI హిస్టరీని మీతో పాటే తెచ్చుకోండి.
మీరు అత్యుత్తమ హిట్‌లను బదిలీ చేయాలనుకున్నా లేదా మీరు ఎక్కడైతే సంభాషణను ఆపివేశారో అక్కడి నుండి కొనసాగించాలనుకున్నా, మేము ఆ ప్రాసెస్‌ను సులభతరం చేశాము.
మీ ప్రస్తుత AIని అడగండి
మేము సూచించిన ప్రాంప్ట్‌ను కాపీ చేసి, మీకు చెందిన ఇతర AI యాప్‌లో పేస్ట్ చేయండి. ఇలా చేసి మీ ప్రాధాన్యతలకు, స్టయిల్‌కు సంబంధించిన సారాంశాన్ని జెనరేట్ చేయండి.
సమాధానాన్ని కాపీ చేయండి
మీ కోసం అది పర్సనలైజ్ చేసి, క్రియేట్ చేసే సారాంశాన్ని కాపీ చేయండి.
Geminiలో పేస్ట్ చేయండి
మీ Gemini దిగుమతి సెట్టింగ్‌లకు వెళ్లి, టెక్స్ట్‌ను పేస్ట్ చేసి, మీరు ఎలా పని చేస్తారో ఇప్పటికే తెలిసిన AIతో చాట్ చేయడం ప్రారంభించండి.
మీ డేటాను ఎగుమతి చేయండి
మీ ప్రస్తుత AI ప్రొవైడర్‌ను డేటా ఎగుమతి కోసం రిక్వెస్ట్ చేయండి (వారు సాధారణంగా మీకు ఒక జిప్ ఫైల్‌ను ఈమెయిల్ చేస్తారు).
Geminiకి అప్‌లోడ్ చేయండి
మీ Gemini సెట్టింగ్‌లలోని "చాట్ హిస్టరీ దిగుమతి" విభాగానికి నావిగేట్ చేసి, మీ జిప్ ఫైల్‌ను ఎంచుకోండి.
ఎక్కడైతే ఆపారో, అక్కడి నుండే కొనసాగించండి
మీ గత థ్రెడ్‌లను Gemini సురక్షితంగా ప్రాసెస్ చేసి, ఆర్గనైజ్ చేస్తుంది, తద్వారా మీరు వాటిని సెర్చ్ చేయవచ్చు, రెఫర్ చేయవచ్చు, అలాగే ఆపిన చోటు నుండే కొనసాగించవచ్చు.
నిజమే… స్విచ్ అవ్వడానికి ఒక్క పైసా కూడా ఖర్చు చేయనక్కర్లేదు
మీరు Geminiని పూర్తిగా సద్వినియోగపరుచుకుంటూ ఉన్నప్పుడు, ఇప్పటివరకు ఏది మిస్ అయ్యారో తెలుసుకోండి.
తరచుగా అడిగే ప్రశ్నలు
AI చాట్ హిస్టరీని దిగుమతి చేయడానికి, మీరు ముందుగా మీ ప్రస్తుత AI ప్రొవైడర్ నుండి మీ డేటాను ఎగుమతి చేయాలి. మీ డేటాను ఎగుమతి చేయడానికి వీలు కల్పించే ఆప్షన్, సాధారణంగా మీ ఇతర యాప్ సెట్టింగ్‌లలో "డేటా కంట్రోల్స్" లేదా "గోప్యత" కింద ఉంటుంది. మీ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసిన తర్వాత, మీ AI హిస్టరీని మీతో తెచ్చుకోవడానికి మీరు దాన్ని నేరుగా Geminiలోకి అప్‌లోడ్ చేయవచ్చు.
ప్రస్తుతానికి, చాట్ హిస్టరీని దిగుమతి చేయడానికి మేము .zip ఫైల్స్‌ను (గరిష్ఠంగా 5 జీబీ) సపోర్ట్ చేస్తున్నాము.
లేదు, మీరు ప్రాజెక్ట్ ఫైల్స్‌ను దిగుమతి చేయలేరు, కానీ మా టూల్ ద్వారా మీరు ఇతర AI ప్రొవైడర్‌ల నుండి మీ పూర్తి చాట్ హిస్టరీని .zip ఫైల్ ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేసి దిగుమతి చేసుకోవచ్చు. అక్కడి నుండి, మీరు ఏ ఫైల్‌ను అయినా నేరుగా Geminiలోకి అప్‌లోడ్ చేయవచ్చు.
మీరు మీ AI చాట్ హిస్టరీని దిగుమతి చేసినప్పుడు, మీ చాట్‌ల టెక్స్ట్ Geminiకి బదిలీ చేయబడుతుంది. మీ మునుపటి యాప్‌లో జెనరేట్ అయిన ఇమేజ్‌లు, ఫైల్స్ చేర్చబడవు.
దిగుమతి అయిన తర్వాత, మీ AI చాట్‌లు మీ ఎడమ వైపు మెనూలో “చాట్‌ల” విభాగంలో కనిపిస్తాయి. వీటిని గుర్తించడానికి ప్రత్యేకమైన 'దిగుమతి అయిన చాట్' చిహ్నం ఉంటుంది.
ఒక చాట్‌ను తొలగించడానికి: మీ మెనూలో చాట్‌ను కనుగొని, మరిన్ని చిహ్నాన్ని క్లిక్ చేసి, తొలగించండి ఆప్షన్‌ను ఎంచుకోండి.
మొత్తం బ్యాచ్‌ను తొలగించడానికి: మీ సెట్టింగ్‌లలో నిర్దిష్ట దిగుమతి ఎంట్రీ పక్కన ఉన్న ట్రాష్ చిహ్నాన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు ఆ .జిప్ ఫైల్ నుండి AI సంభాషణలన్నింటినీ తొలగించవచ్చు.
అనుకూలత, లభ్యత మారుతూ ఉంటాయి. 18+ యూజర్‌లకు అందుబాటులో ఉంటుంది. దీని కోసం Geminiలో పర్సనలైజేషన్ తప్పనిసరిగా ఎనేబుల్ అయి ఉండాలి.