పర్సనల్ ఇంటెలిజెన్స్
మీ కోసం ప్రత్యేకంగా వ్యక్తిగతీకరించిన (పర్సనలైజ్ చేసిన) సహాయం
వెకేషన్ ఐడియాల నుండి ప్రాజెక్ట్ ప్లాన్‌ల వరకు, ఇంకా మరిన్నింటిలో అత్యంత పర్సనలైజ్డ్ సహాయాన్ని పొందండి. మీ ప్రపంచానికి అనుగుణంగా సూచనలను అందించడానికి Gemini, మీ Google యాప్స్‌లోని Gmail, Photos, Search, YouTube వంటి యాప్‌లను, మీ చాట్ హిస్టరీ ప్రాధాన్యతలను కనెక్ట్ చేస్తుంది.
ప్రతి సమాధానాన్ని మీరు అడిగిన స్టయిల్‌లో అందిస్తుంది
మీ అవసరాలకు అనుగుణంగా రూపొందించిన సహాయక ఫీచర్ ఇదిగోండి
Gmail, Photos, Search, YouTube వంటి మీ Google యాప్స్‌లో Geminiని కనెక్ట్ చేయండి, Geminiని ప్రత్యేకించి మీకు ఉపయోగకరంగా మార్చుకోండి. కంట్రోల్ మీ చేతుల్లో ఉంది. ఏ యాప్‌లను కనెక్ట్ చేయాలి అనే దానిని మీరు నిర్ణయిస్తారు, అలాగే మీ పర్సనలైజేషన్ సెట్టింగ్స్‌ను ఏ సమయంలోనైనా మేనేజ్ చేయవచ్చు.
అర్హత గల యూజర్‌లకు ఇప్పుడు రిలీజ్ అవుతోంది.
మీ ఆప్షన్‌లను కుదించండి
పెద్ద మొత్తంలో కొనుగోలు చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నారా? Gemini వివిధ ప్రోడక్ట్‌లను రీసెర్చ్ చేసి, మీ నిర్దిష్ట అవసరాలకు సరిపోయే ఛాయిస్‌లను అందించగలదు.
మరింత నిర్దిష్టమైన వాటిని పొందడానికి మీ ప్రాధాన్యతలను షేర్ చేయండి
మరింత సహాయకరమైన, సందర్భోచితమైన సమాధానాలను పొందడానికి, మీ వర్క్, హాబీలు, లైఫ్ గోల్స్ వంటి ఆసక్తులను, ప్రాధాన్యతలను గుర్తుంచుకోమని Geminiని అడగండి.
మీరు ఇష్టపడే కొత్త విషయాలను సెర్చ్ చేయండి
మీ రీడింగ్ హిస్టరీకి, అభిరుచులకు అనుగుణంగా రూపొందించిన పుస్తకాల సిఫార్సులను ఉపయోగించి, మీరు చదవడం ఆపలేనంత ఆసక్తికరమైన పుస్తకాలను వెతికి పెట్టమని Geminiని అడగండి.
ప్రతిసారీ నిరంతరాయంగా సంభాషణలు జరపండి
మునుపటి చాట్‌లను ఉపయోగించి సమాధానాలు ఇవ్వమని Geminiని అడగండి. మీరు ఆపిన చోటు నుండే ఈజీగా కొనసాగించవచ్చు లేదా మునుపటి టాపిక్‌పై సమ్మరీ ఇవ్వమని అడగవచ్చు. మీరు Geminiతో చేసిన ఏ చాట్‌లనైనా చూడవచ్చు లేదా డిలీట్ చేయవచ్చు.
అంతగా తెలియని ఆసక్తికరమైన ప్రదేశాలను కనుగొనండి
మీ కోసం పర్సనలైజ్ చేసిన ట్రిప్‌ను క్రియేట్ చేయండి. మీ అభిరుచులు, గతంలో మీరు ఎంచుకున్న వాటి ఆధారంగా Gemini ప్రదేశాలను సిఫార్సు చేస్తుంది. తద్వారా మీరు ఎక్స్‌ప్లోర్ చేయడానికి, లోకల్ ఫుడ్ నుండి కొత్త పరిసరాల వరకు కొత్త ఫేవరెట్‌లను కనుగొనడంలో మీకు సహాయపడుతుంది.
మీ గోప్యత కంట్రోల్ మీ చేతుల్లోనే ఉంటుంది
మీకు పారదర్శకత, కంట్రోల్ విషయంలో హామీ ఇస్తున్నాము.
మీకు నచ్చినప్పుడు సమ్మతించండి, నచ్చినప్పుడు సమ్మతిని నిలిపివేయండి
పర్సనల్ ఇంటెలిజెన్స్ ఎక్స్‌పీరియన్స్‌లు అనేవి ఆప్షనల్. ఏ Google యాప్‌లను కనెక్ట్ చేయాలి, మీ మునుపటి చాట్‌లను ఎలా ఉపయోగించాలి, మీ స్వంత సూచనలను సెట్ చేసుకోవడం వంటివి మీరు ఎంచుకోవచ్చు.
మీ డేటాను సులభంగా మేనేజ్ చేయండి
మీ Google యాక్టివిటీని చూడండి, Gemini సెట్టింగ్స్‌లో మీ పర్సనల్ ఇంటెలిజెన్స్‌ను యాక్సెస్ చేయండి, మీ మునుపటి Gemini చాట్ హిస్టరీని రివ్యూ చేయండి.
పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తాము
మీరు కనెక్ట్ చేసిన సోర్స్‌ల నుండి ఉపయోగించిన సమాచారాన్ని Gemini రెఫరెన్స్‌గా ఇవ్వడానికి లేదా వివరించడానికి ట్రై చేస్తుంది, తద్వారా మీరు దాన్ని వెరిఫై చేయగలరు. అది అలా చేయకపోతే, మీరు మరింత సమాచారం కోసం దానిని అడగవచ్చు.
తరచుగా అడిగే ప్రశ్నలు
పర్సనల్ ఇంటెలిజెన్స్ సాయంతో, మీ కాంటెక్స్ట్‌తో పాటు మీ ప్రాంప్ట్‌ను అనలైజ్ చేసి, Gemini మరింత సందర్భోచితమైన, పర్సనలైజ్ చేసిన సమాధానాలను అందిస్తుంది. సమాధానాన్ని జెనరేట్ చేయడంలో మీ అనుకూల సూచనలు, మునుపటి చాట్‌లు లేదా మీరు కనెక్ట్ చేసిన Google యాప్స్ నుండి పొందిన సమాచారం సహాయకరంగా ఉంటుందో లేదో ఇది నిర్ణయిస్తుంది. మీరు అందుకునే సమాచారం మీ నిర్దిష్ట ఆసక్తులకు, అవసరాలకు అనుగుణంగా ఉందని ఈ అదనపు కాంటెక్స్ట్ నిర్ధారిస్తుంది.
పర్సనల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం ప్రపంచవ్యాపంగా అర్హత గల యూజర్లకు బీటా ఫీచర్‌గా రిలీజ్ అవుతోంది. అయితే, సౌత్ కొరియా, ఐరోపా ఆర్థిక మండలి, స్విట్జర్లాండ్, యునైటెడ్ కింగ్‌డమ్, నైజీరియా దేశాల్లో రిలీజ్ కాదు.
అవసరాలు: మీ వయస్సు తప్పనిసరిగా 18 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండాలి. ఈ బీటా ఫీచర్ వ్యక్తిగత Google ఖాతాలకు అందుబాటులో ఉంది, Workspace బిజినెస్, ఎంటర్‌ప్రైజ్ లేదా ఎడ్యుకేషన్ యూజర్‌లకు అందుబాటులో లేదు.
ప్లాట్‌ఫామ్‌లు: ఎనేబుల్ చేసిన తర్వాత, ఇది వెబ్, Android, iOS అంతటా పని చేస్తుంది.
మోడల్స్: ఇది ప్రస్తుతం Gemini మోడల్ పికర్‌లో అందుబాటులో ఉన్న అన్ని మోడల్స్‌తో పని చేస్తుంది.
పర్సనల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం Gmail, Photos, Search, YouTube వంటి Google యాప్‌లతో కనెక్ట్ అవుతుంది. రాబోయే నెలల్లో, మీ అనుమతితో, మరింత మెరుగైన వ్యక్తిగతీకరించిన (పర్సనలైజ్ చేసిన), సందర్భోచిత సమాధానాలను అందించడానికి, మీ Google యాప్‌లు, సర్వీస్‌ల నుండి Gemini మరింత కాంటెక్స్ట్‌ను పొందుతుంది.
సీక్వెన్స్‌లు షార్టెన్ అయ్యాయి. సమాధానాలను చెక్ చేయండి. సెటప్ అవసరం. అనుకూలత, లభ్యత మారుతూ ఉంటాయి. 18+ యూజర్‌లకు అందుబాటులో ఉంది.