Skip to main content

Chromeలో Geminiని నేరుగా ఉపయోగించండి

మీ బ్రౌజర్‌లోనే నేరుగా AI సహాయాన్ని పొందండి.

మీరు ఉన్న చోటే, మీతో కలిసి పని చేసే ఇంటెలిజెన్స్.

ట్యాబ్‌లను మార్చకుండానే, మీ ప్రస్తుత పేజీ కంటెంట్ ఆధారంగా కీలకమైన అంశాలను పొందండి, కాన్సెప్ట్‌లలో మీకు ఉండే డౌట్స్ నివృత్తి చేసుకోండి, సమాధానాలను కనుగొనండి.

అవసరమైన వాటిని త్వరగా అర్థం చేసుకోవాలా? Gemini ఆర్టికల్స్, పేజీలు, లేదా థ్రెడ్‌ల సంక్షిప్త సారాంశాలను నేరుగా మీ బ్రౌజర్‌లో అందిస్తుంది, తద్వారా మీరు ప్రధాన పాయింట్‌లను త్వరగా గ్రహించవచ్చు.

మీరు చదువుతున్న దాని గురించి ఏదైనా సందేహం ఉందా? Geminiని అడగండి. మీరు ఫోకస్డ్‌గా ఉండేలా, సందర్భోచితమైన సమాధానాలను, వివరణలను అందించడానికి ఇది ప్రస్తుత పేజీ కంటెంట్‌ను ఉపయోగిస్తుంది.

లోతైన వివరణలను తెలుసుకోండి. మీరు క్లిష్టమైన టాపిక్‌లను లేదా కొత్త కాన్సెప్ట్‌లను నేర్చుకుంటున్నప్పుడు, Geminiని కేవలం గందరగోళంగా ఉన్న పార్ట్‌లను స్పష్టం చేయమని మాత్రమే కాకుండా, మెటీరియల్‌తో యాక్టివ్‌గా ఎంగేజ్ అవ్వడంలో మీకు సహాయం చేయమని కూడా అడగండి.

ప్రోడక్ట్‌లను రీసెర్చ్ చేస్తున్నారా లేదా ఎంపికలను బేరీజు వేస్తున్నారా? పేజీ నుండి కీలక సమాచారాన్ని, స్పెసిఫికేషన్‌లను, లేదా ప్రయోజనాలు, ప్రతికూలతలను తెలుసుకొని చెప్పమని Geminiని అడగండి. స్పష్టంగా, సులభంగా అర్థమయ్యే సమాచారంతో కూడిన ఎంపికలు చేయడంలో మీకు సహాయపడుతుంది.

లోతుగా చర్చించాలనుకుంటున్నారా, ఆలోచనలను క్రమబద్ధీకరించాలనుకుంటున్నారా, లేదా ఒక టాపిక్‌ను క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటున్నారా? Gemini Liveతో సహజంగా చాట్ చేయండి, Chromeలోనే సమాధానాలను వినండి.

మీ వెబ్ కంట్రోల్ మీ చేతుల్లోనే ఉంది

"Chromeలో Gemini" మీ నియమాల ప్రకారమే మీతో పని చేస్తుంది. మీరు అడిగినప్పుడు మాత్రమే ఇది సహాయం చేస్తుంది, తద్వారా దీని కంట్రోల్‌ పూర్తిగా మీ చేతుల్లోనే ఉంటుంది.

మీరు సిద్ధంగా ఉన్నప్పుడు ప్రారంభిద్దాం

మీరు Gemini చిహ్నాన్ని క్లిక్ చేయడం ద్వారా లేదా మీరు సెటప్ చేసిన కీబోర్డ్ షార్ట్‌కట్‌ను ఉపయోగించడం ద్వారా దాన్ని ఉపయోగించాలని ఎంచుకున్నప్పుడు మాత్రమే Chromeలో Gemini యాక్టివేట్ అవుతుంది. మీరు అడిగినప్పుడు మాత్రమే జోక్యం చేసుకుంటూ, మీ నియమాల ప్రకారం ఇది సహాయం చేస్తుంది.

మీకు కావలసిన విధంగా సహాయం పొందండి

Chromeలో Geminiతో మీకు నచ్చిన విధంగా సహాయాన్ని పొందండి. మీ ప్రశ్నను సహజంగా చెప్పండి లేదా టైప్ చేయండి, కంటెంట్‌ను త్వరగా అర్థం చేసుకోవడంలో లేదా విసుగు పుట్టించే టాస్క్‌లను పూర్తి చేయడంలో మీకు సహాయపడటానికి Gemini పేజీ కంటెంట్‌ను ఉపయోగించగలదు.

మీ యాక్టివిటీని సులభంగా మేనేజ్ చేయండి

మీ యాక్టివిటీని మేనేజ్ చేయడానికి, తొలగించడానికి, అలాగే ఆఫ్ చేయడానికి మీరు ఎప్పుడైనా మీ Gemini యాప్స్ యాక్టివిటీని యాక్సెస్ చేయవచ్చు.

సరికొత్త వెబ్.

Chromeలో Geminiతో, మీ బ్రౌజర్‌లో AI సహాయాన్ని పొందుతారు కాబట్టి ట్యాబ్‌లను మార్చాల్సిన అవసరం లేదు, కంటెంట్‌ను త్వరగా అర్థం చేసుకోవడంలో లేదా మీ ప్రస్తుత పేజీ కంటెంట్‌ను ఉపయోగించి టాస్క్‌లను పూర్తి చేయడంలో మీకు సహాయపడుతుంది.

తరచుగా అడిగే ప్రశ్నలు

Chromeలో Gemini ఫీచర్‌తో, మీరు ముఖ్యమైన అంశాలను పొందడం, కాన్సెప్ట్‌లలో మీకు ఉండే డౌట్స్ నివృత్తి చేసుకోవడం, సమాధానాలను కనుగొనడం ఇంకా మరిన్ని పనులు సులభంగా చేయడానికి మీ డెస్క్‌టాప్‌లో AI సహాయాన్ని పొందవచ్చు. అత్యంత సందర్భోచితమైన సమాధానాలను అందించడానికి, Chromeలోని Gemini మీరు చూస్తున్న వెబ్ పేజీ కంటెంట్‌ను ఉపయోగిస్తుంది. 

Chromeలోని Gemini, డెస్క్‌టాప్‌లోని Chrome బ్రౌజర్‌లో భాగం. ఇది, ఏ బ్రౌజర్‌లోనైనా Gemini వెబ్‌సైట్‌కు అంటే gemini.google.com లింక్‌కు వెళ్లడం లేదా Chromeలోని అడ్రస్ బార్‌లో @gemini అని టైప్ చేయడం ద్వారా Gemini వెబ్ యాప్‌తో చాట్‌ను ప్రారంభించడం కంటే భిన్నంగా ఉంటుంది. మీరు ఇతర బ్రౌజర్‌లలో (లేదా Chrome కంటెంట్ ఏరియాలో) Gemini వెబ్ యాప్‌ను ఉపయోగించవచ్చు, కానీ మీరు పేజీ కంటెంట్‌ను షేర్ చేయలేరు లేదా Chromeలో Geminiతో చేయగలిగిన విధంగా Live మోడ్‌ను ఉపయోగించలేరు.

మీరు Chrome టూల్‌బార్‌లోని Gemini చిహ్నం ద్వారా లేదా Windows లేదా Mac డెస్క్‌టాప్‌లో మీరు సెటప్ చేసిన కీబోర్డ్ షార్ట్‌కట్ ద్వారా Chromeలో Geminiని యాక్సెస్ చేయవచ్చు.

Chromeలో Geminiని మొదటగా USలోని Google AI Pro, Ultra సబ్‌స్క్రయిబర్‌లకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. వారు ఈ ఫీచర్‌ను ఉపయోగించాలంటే, వారి Chrome బ్రౌజర్‌లోని భాషను ఇంగ్లీష్‌గా సెట్ చేసి ఉండాలి. ఈ ఫీచర్‌ను త్వరలో మరింత మందికి, అదనపు భాషల్లో అందుబాటులోకి తీసుకురావాలని మేము ఎదురు చూస్తున్నాము.

ఫలితాలు ఉదాహరణ నిమిత్తం చూపబడ్డాయి, ఇవి భిన్నంగా ఉండవచ్చు. సమాధానాలు ఖచ్చితంగా ఉన్నాయా లేదా అన్నది చెక్ చేసుకోండి. Google AI Pro లేదా Ultra సబ్‌స్క్రిప్షన్, సెటప్ కోసం బ్రౌజర్ అవసరం. నిర్దిష్ట ఫీచర్‌లకు, ఖాతాలకు అనుకూలంగా ఉంటుంది. ఎంపిక చేసిన డివైజ్‌‌లలో, ఎంపిక చేసిన దేశాలు, భాషలలో, 18 సంవత్సరాలు నిండిన యూజర్‌లకు అందుబాటులో ఉంది.