Skip to main content

Chromeలో Geminiని నేరుగా ఉపయోగించండి

మీ బ్రౌజర్‌లోనే నేరుగా AI సహాయాన్ని పొందండి.

మీరు ఉన్న చోటే, మీతో కలిసి పని చేసే ఇంటెలిజెన్స్.

మీరు తెరిచిన ట్యాబ్‌ల (కాంటెక్స్ట్) సందర్భం ఆధారంగా కీలకమైన సారాంశాలను తెలుసుకోండి, కాన్సెప్ట్‌ల్లో మీకు ఉండే డౌట్స్ నివృత్తి చేసుకోండి, సమాధానాలను కనుగొనండి.

ఇన్‌స్టంట్‌గా సారాంశాన్ని పొందండి

అవసరమైన వాటిని త్వరగా అర్థం చేసుకోవాలా? Gemini ఆర్టికల్స్, పేజీలు, లేదా థ్రెడ్‌ల సంక్షిప్త సారాంశాలను నేరుగా మీ బ్రౌజర్‌లో అందిస్తుంది, తద్వారా మీరు ప్రధాన పాయింట్‌లను త్వరగా గ్రహించవచ్చు.

సులభంగా ఆప్షన్‌లను పోల్చి చూడండి

ఓపెన్ చేసిన ట్యాబ్‌లతో ఫుల్లుగా ఉన్న బ్రౌజర్‌ను ఒక క్లియర్ సమ్మరీగా మార్చండి. చాయిస్‌ల మధ్య స్పెసిఫికేషన్‌లను, ప్రోస్ అండ్ కాన్స్‌ను (ప్లస్‌లను, మైనస్‌లను) ఆర్గనైజ్ చేయి అని Geminiకి చెప్పండి. తద్వారా మీరు పెద్దగా శ్రమ తీసుకోకుండానే ఏది బెస్ట్ అన్నది నిర్ణయించుకోవచ్చు.

మీ ఫేవరెట్ యాప్‌ల ద్వారా మరిన్ని చేయండి

మీ రోజువారీ పనులను సులభంగా పూర్తి చేయడంలో మీకు సహాయపడటానికి Gemini మీ Google యాప్‌లన్నింటిలో పని చేస్తుంది. ఇది మీ ఇన్‌బాక్స్ నుండి ఫ్లైట్ సమయాన్ని చూపగలదు, Google Flightsలో వివరాలను చెక్ చేయగలదు, అలాగే ట్యాబ్‌లను మార్చకుండానే మీ ఫ్రెండ్స్‌కు అప్‌డేట్‌ను డ్రాఫ్ట్ చేయగలదు.

ఆటోమేటిక్ బ్రౌజ్‌తో మీ టాస్క్‌లను ఆటోమేట్ చేయండి

అపాయింట్‌మెంట్ బుకింగ్ దగ్గర నుండి పార్టీ ప్లానింగ్ దాకా, మీకు ఏం కావాలో Geminiకి చెప్పండి. అది మీ తరఫున ఆ పనులను హ్యాండిల్ చేయడం మీరే చూడండి. అదే సమయంలో కంట్రోల్‌ను మీ చేతుల్లో ఉంచుతుంది.

ఇప్పుడే ట్రై చేయండి: మొదటగా USలోని Google AI Pro, Ultra సబ్‌స్క్రయిబర్‌లకు వ్యూ మోడ్‌లో మొదట రోల్-అవుట్ చేస్తున్నాము.

దీనితో పాటు ఏమేమి వస్తాయో చూడండి

మీరు చూస్తున్న దాన్ని అర్థం చేసుకోవడం ద్వారా, దానికి సరిగ్గా మ్యాచ్ అయ్యే దాన్ని కనుగొనడంలో Gemini మీకు సహాయపడుతుంది. మీరు ఉన్న చోటే, కాంప్లిమెంటరీ ఐటెమ్‌ల కోసం సూచనలను పొందండి.

మీ కుతూహలాన్ని పూర్తిగా కొత్త కోణం నుండి చూడండి

మీకు ఇప్పటికే నచ్చిన వాటిని అర్థం చేసుకోవడం ద్వారా, Gemini అనుకూలమైన యాక్టివిటీలను, హాబీలను చూపిస్తుంది—మీరు తప్పక ఆస్వాదించే దాగి ఉన్న అభిరుచులను వెల్లడిస్తుంది.

Now rolling out to eligible users in select regions.

ఐడియాలు, ప్రశ్నల గురించి వివరంగా మాట్లాడండి

లోతుగా చర్చించాలనుకుంటున్నారా, ఆలోచనలను క్రమబద్ధీకరించాలనుకుంటున్నారా, లేదా ఒక టాపిక్‌ను క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటున్నారా? Gemini Liveతో సహజంగా చాట్ చేయండి, Chromeలోనే సమాధానాలను వినండి.

మీ ఫోన్‌లో సహాయం పొందండి

సరిగ్గా మీ కంప్యూటర్‌లో లానే, మీరు చదువుతున్న వాటి గురించి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి మొబైల్‌లో Gemini అందుబాటులో ఉంది. Androidలో ఇది Chromeతో సహా మీ స్క్రీన్‌పై ఉన్న దేనితోనైనా పని చేస్తుంది. iOSలో, మేము Geminiని నేరుగా Chrome యాప్‌లో బిల్ట్ చేశాము.

A prompt box for Gemini in Chrome for mobile devices.

మీ వెబ్ కంట్రోల్ మీ చేతుల్లోనే ఉంది

"Chromeలో Gemini" మీ నియమాల ప్రకారమే మీతో పని చేస్తుంది. మీరు అడిగినప్పుడు మాత్రమే ఇది సహాయం చేస్తుంది, తద్వారా దీని కంట్రోల్‌ పూర్తిగా మీ చేతుల్లోనే ఉంటుంది.

మీరు సిద్ధంగా ఉన్నప్పుడు ప్రారంభిద్దాం

మీరు Gemini చిహ్నాన్ని క్లిక్ చేయడం ద్వారా లేదా మీరు సెటప్ చేసిన కీబోర్డ్ షార్ట్‌కట్‌ను ఉపయోగించడం ద్వారా దాన్ని ఉపయోగించాలని ఎంచుకున్నప్పుడు మాత్రమే Chromeలో Gemini యాక్టివేట్ అవుతుంది. మీరు అడిగినప్పుడు మాత్రమే జోక్యం చేసుకుంటూ, మీ నియమాల ప్రకారం ఇది సహాయం చేస్తుంది.

మీకు కావలసిన విధంగా సహాయం పొందండి

Chromeలో Geminiతో మీకు నచ్చిన విధంగా సహాయాన్ని పొందండి. మీ ప్రశ్నను సహజంగా చెప్పండి లేదా టైప్ చేయండి, కంటెంట్‌ను త్వరగా అర్థం చేసుకోవడంలో లేదా విసుగు పుట్టించే టాస్క్‌లను పూర్తి చేయడంలో మీకు సహాయపడటానికి Gemini పేజీ కంటెంట్‌ను ఉపయోగించగలదు.

మీ యాక్టివిటీని సులభంగా మేనేజ్ చేయండి

మీ యాక్టివిటీని మేనేజ్ చేయడానికి, తొలగించడానికి, అలాగే ఆఫ్ చేయడానికి మీరు ఎప్పుడైనా మీ Gemini యాప్స్ యాక్టివిటీని యాక్సెస్ చేయవచ్చు.

తరచుగా అడిగే ప్రశ్నలు

Chromeలో Gemini ఫీచర్‌సాయంతో, మీరు ముఖ్యమైన సారాంశాలను పొందడం, కాన్సెప్ట్‌లలో మీకు ఉండే డౌట్స్ నివృత్తి చేసుకోవడం, సమాధానాలను కనుగొనడం ఇంకా మరిన్ని పనులు సులభంగా చేయడానికి మీ బ్రౌజర్ నుండి AI సహాయాన్ని పొందవచ్చు. అత్యంత సందర్భోచితమైన సమాధానాలను అందించడానికి, Chromeలో Gemini తెరిచి ఉన్న మీ ట్యాబ్‌ల కాంటెక్స్ట్‌ను ఉపయోగిస్తుంది.

Chromeలోని Gemini, డెస్క్‌టాప్‌లోని Chrome బ్రౌజర్‌లో భాగం. ఇది, ఏ బ్రౌజర్‌లోనైనా Gemini వెబ్‌సైట్‌కు అంటే gemini.google.com లింక్‌కు వెళ్లడం లేదా Chromeలోని అడ్రస్ బార్‌లో @Gemini అని టైప్ చేయడం ద్వారా Gemini వెబ్ యాప్‌తో చాట్‌ను ప్రారంభించడం కంటే భిన్నంగా ఉంటుంది. మీరు ఇతర బ్రౌజర్‌లలో (లేదా Chrome కంటెంట్ ఏరియాలో) Gemini వెబ్ యాప్‌ను ఉపయోగించవచ్చు, కానీ మీరు పేజీ కంటెంట్‌ను షేర్ చేయలేరు లేదా Chromeలో Geminiతో చేయగలిగిన విధంగా Live మోడ్‌ను ఉపయోగించలేరు.

మీరు Chrome టూల్‌బార్‌లోని Gemini చిహ్నం ద్వారా లేదా Windows, MacOS, Chromebook Plusలో మీరు సెటప్ చేసిన కీబోర్డ్ షార్ట్‌కట్ ద్వారా Chromeలో Geminiని యాక్సెస్ చేయవచ్చు.

Androidలో Chromeను, ఇతర యాప్‌లను ఉపయోగిస్తున్నప్పుడు పవర్ బటన్‌ను హోల్డ్ చేయడం (నొక్కి ఉంచడం) ద్వారా కూడా మీరు Geminiని యాక్టివేట్ చేయవచ్చు. త్వరలో, iOSలో Chromeలో Gemini యాప్‌లో బిల్డ్ చేయబడుతుంది, Chrome ఓమ్నిబాక్స్ ద్వారా యాక్సెస్ చేయబడుతుంది.

Check responses. Setup required. Compatibility and availability vary. 18+.